Etela Rajender Speech In BC Journalist Meeting: రాజ్యాధికారం రావాలంటే చేతల్లో చూపించాలని.. లీడర్షిప్ క్వాలిటీస్ కావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ జర్నలిస్ట్ సమ్మేళనం కార్యక్రమానికి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రాను రాను చైతన్యం, ఐక్యత తగ్గిపోతోందన్నారు. ‘నాకేంటి’ అనే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఆ స్థితి మారాలని సూచించారు. ఈ సభ అందుకు చైతన్యం రగిలించాలని, ఆకలితో ఉన్నవారికి సంఘం కావాలని అన్నారు. తాను ఆర్థికమంత్రి అయిన తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉన్నానని, కాబట్టి అక్కడ పెట్టే బువ్వ గురించి తెలిసి తాను సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చానని చెప్పారు. 40 రోజుల పాటు బీసీలలో అన్ని కులాల వారితో అసెంబ్లీలో మీటింగ్ పెట్టానని.. మూడు రోజుల పాటు బీసీ ఎమ్మెల్యే, ఎంపీలతో మీటింగ్ పెట్టానని, ఆ సమావేశ ఫలితమే 240 రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పుకొచ్చారు.
Student Car Accident: కారుతో ఇంటర్ విద్యార్థి బీభత్సం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు
డాక్టర్, ఇంజనీర్ అవ్వాలని మెరిట్ ఉండాలని.. రాజకీయ నాయకుడుకి కూడా అలాంటి మెరిట్ కావాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కానీ.. ఆ మెరిట్ ఇప్పుడు డబ్బుగా మారిందన్నారు. ఆకలి, పేదరికం, అణచివేత, రాజ్యాంగ స్ఫూర్తి అర్థం చేసుకున్నవాడే నిజమైన మెరిట్ గల లీడర్ అని అభివర్ణించారు. మార్పు రావాల్సిందేనని.. ఆ మార్పు బీసీ జర్నలిస్ట్‌లు తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకంగా పాల్గొన్నారని.. తాము పోని జాగాలకు కూడా జర్నలిస్టులు వెళ్లారని గుర్తు చేశారు. అయితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న పేపర్లను సీఎం కేసఆర్ చంపేశారని ఆరోపించారు. ఎక్కడో యూపీలో యాడ్‌లు ఇస్తున్నారే తప్ప, ఇక్కడ ఇవ్వడం లేదని మండిపడ్డారు. శోధించి, సాధించి రాసిన వార్తలను కూడా యాజమాన్యాలు బయటికి రానివ్వడం లేదన్నారు. జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడం లేదని.. వారికిచ్చిన హెల్త్ కార్డులు చెల్లడం లేదని.. అక్రిడేషన్ కూడా ఇవ్వరని ఆరోపణలు గుప్పించారు. అధికార మార్పు జరిగితే.. జర్నలిస్ట్‌లకు అన్నీ వసతులు కల్పిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
Artisans Strike: సమస్యలు పరిష్కరించాలని 25 నుంచి ఆర్టిజన్ల సమ్మె!