Revanth Reddy Speech In Congress People March Meeting: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పీపుల్ మార్చ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాకు రాజకీయంగా ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి చేస్తానని మాటిచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. లక్షల మంది వలసపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్‌ను పాలమూరు జిల్లా ప్రజలు అక్కున చేర్చుకుంటే.. ఆయన మాత్రం ఇక్కడి ప్రజల్ని నట్టేటముంచాడని ఆరోపణలు చేశారు. 60 సంవత్సరాల ఆకాంక్షను సోనియాగాంధీ నేరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. గొర్రెలు, బర్రెలు అంటూ కేసీఆర్ మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Bhatti Vikramarka: 5 నెలల్లో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుంది
పాలమూరు జిల్లాలో పుట్టి పెరిగిన తనను తెలంగాణ రాష్ట్రనికి అధ్యక్షుడిగా చేసిన ఘనత సోనియాగాంధీది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా.. పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేడన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు అభివృద్ధి చెందిందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డి.. నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడని ఆరోపణలు చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే జడ్చర్లకు అవసరం లేదన్నారు. పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు 14 సీట్లు గెలిపించి తనని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేస్తామన్నారు. 2024 కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన గ్రామంలో మాత్రమే బిఆర్ఎస్ నేతలు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతామని చెప్పారు.
Kerala: పోలీస్ అధికారుల పిల్లలు కూడా డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారు.