ఎన్నికల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు ఇచ్చింది అని ఆ రాష్ట్ర మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. వృద్దులకు పెన్షన్లు ఇవ్వటం కాదు.. ఇంట్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి.. పీజీ, పీహెచ్ డీలు చదువుకున్న వారిని బర్రెలు, గొర్రెలు కాసుకోమంటున్నాడు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ కాలెండర్ విడుదల చేస్తాము అని ఆయన తెలిపారు.
నేడు గులాబీ బాస్ కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనబోతున్నారు. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగం చేయనున్నారు.
Konda Surekha: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కొండా సురేఖ ప్రచార వాహనం డ్రైవర్‌పై పోలీసులు దాడి చేయడంతో వరంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఏదో ఒకటి చేయమని అడిగారని, ఇష్టానుసారంగా దుర్భాషలాడారని, లాఠీలతో కొట్టారని ఆరోపించారు.
Barrelakka: సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కర్నె శిరీష ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ బాలిక కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది.
Priyanka Gandhi: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు ఓటింగ్‌కు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
Bandi Sanjay: నిర్మల్ జిల్లా ముధోల్ ప్లానింగ్ ఏరియాలోని భైంసా పట్టణంలో ఇవాళ నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరుకానున్నారు.
నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొననున్నారు.
నేడు సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు.
నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికీ చేరేలా కమలం పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలంగఆణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు.