ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికలు ఒక సెమీ ఫైనల్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ అన్నారు. భారత రాజకీయ చరిత్రలో దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసింది బీజేపీనే అని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్ లోకి మారారు అని మహమ్మూద్ అలీ ఆరోపించారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి మిస్ గైడ్ చేశారు.. కాంగ్రెస్ లో చాలా మంది సీఎంలు ఉన్నారు.. బీఆర్ఎస్ లో మాత్రం ఒక్కరే సీఎం ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ను ఓడగొట్టకపోతే గజ్వెల్ ప్రజలు బాగుపడరు.. మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో మరోసారి కేసీఆర్ పొరపాటున గెలిచిన ఆర్టీసీ ఆస్తులు మిగలవు అని బండి సంజయ్ ఆరోపించారు. మీ పక్షాన యుద్దం చేస్తున్న నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. మీపక్షాన పోరాడే నాలాంటోళ్లకు అండగా నిలవండి అని కరీంనగర్ ప్రజలను కోరారు.
తెలంగాణలో నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో భారీ స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వారికి కేటాయించే గుర్తులపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది.
KTR Road Show: తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్‌ఎస్ ఇప్పుడు తదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఈసారి గ్రేటర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగనున్నారు.
మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రోడ్ షో వివరాలు ఇవే.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సపోర్టుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ టౌన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోసం కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు.
తెలంగాణలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు గులాబీ అధినేత నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.
నిజామాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగూరు నీటిని నిజాం సాగర్ కు తరలించామన్నారు. నిజామాబాద్ కు ఐటి హబ్ తెచ్చామని, కాంగ్రెస్ వస్తే భయంకర breaking news, latest news, telugu news, cm kcr, telangana election 2023, brs