Priyanka Gandhi: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు ఓటింగ్‌కు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు రోజుకు రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అలాగే రకరకాల వాగ్దానాలతో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పార్టీలు ప్రచారం ద్వారా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ అగ్రనేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో పాటు తెలంగాణ ఎన్నికలపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తరచుగా పాల్గొంటున్నారు.
Read also: CM KCR: ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
రాహుల్ ఇటీవల రెండు రోజుల ప్రచారం చేయగా, ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు.ఒకవైపు రేవంత్, భట్టి, మరోవైపు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇవాళ తెలంగాణకు ఏఐసీసీ ప్రియాంకగాంధీ రానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ రెండు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ముందుగా నాందెడ్ నుంచి చాపర్ ద్వారా ఖానాపూర్ కు చేరుకోనున్నారు. ఇక్కడ సభ తరువాత ఆసిఫాబాద్ లో నిర్వహించే సభకు హాజరు కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు రెండు చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.40 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి బయలుదేరి.. ఆతరువాత నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో ఖానాపూర్ కు మధ్నాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. అనంతరం మధ్నాహ్నం 1 గంట వరకు ఖానాపూర్ సభ లో పాల్గొననున్నారు. ఇక 1.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆసిఫాబాద్ సభలో పాల్గొననున్నారు. సభ తరవాత మళ్ళీ నాందేడ్ మీదుగా ఢిల్లీ వెళ్లనున్నారు ప్రియాంక. అంతేకాకుండా వచ్చే వారం సోనియాగాంధీ తెలంగాణలో ప్రచారం చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనతో హస్తం పార్టీ క్యాడర్‌లో ఉత్కంఠ నెలకొంది.
Read also: IND vs AUS Final 2023: నేడు వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మూడో టైటిల్‌పై భారత్ గురి!
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణలో ఎన్నికల ఓటింగ్ జరగనుండగా, నవంబర్ 28 సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇక ప్రచారానికి మరో పదిరోజులు మాత్రమే సమయం ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఆరు హామీలే తమకు విజయాన్ని చేకూరుస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. మరియు BRS ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పూర్తి మేనిఫెస్టోను విడుదల చేశారు. 6 హామీలతో పాటు మరికొన్ని కీలక హామీలను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సీఎం కేసీఆర్ రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని నేతలు రోజుకో మాట చెబుతున్నారు.
Sruthi Hasan : డిఫరెంట్ డ్రెస్సులో ఓర చూపులతో మత్తెక్కిస్తున్న శృతిహాసన్..