తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులొడ్డి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్.. తాను పాల్గొంటున్న ప్రతి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగాన్ని ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూనే ప్రారంభం చేస్తున్నారు. ప్రజల చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం ఐదేళ్ల వారి భవిష్యత్ నే కాకుండా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను కూడా మార్చేస్తుందంంటూ ఓటర్లకు కేసీఆర్ అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Dhoni : వావ్.. వాట్ ఏ టాలెంట్ భయ్యా.. ధోని ఫ్యాన్స్ కు పండగే..
ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గులాబీ బాస్ కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనబోతున్నారు. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగం చేయనున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగాల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించే కేసీఆర్ ప్రజలకు వివరిస్తున్నారు.