తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్ వేదికగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రి కేటీఆర్. మీతో ముచ్చటించడానికి ఎదురుచూస్తున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిలో నెటిజన్లు వారికి సంబంధించిన వివరాలు, సూచనలు అందించాలని కోరారు. అయితే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమాన్ని…
దేశప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వీరి నాయకత్వంలో ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తున్నామో యోజన పత్రిక వివరించిందన్నారు మంత్రి. కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్లె ప్రగతి వల్ల గ్రామాలు బాగుపడ్డాయి. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేసీఆర్ ఒక ప్రణాళిక ప్రకారం రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా ఉండేది. ఇప్పుడు అనేక…
తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియమాకాలని… ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ వచ్చినప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయని.. తెలంగాణ లో శాంతి భద్రతలు కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దేశం లలో మహబూబ్ నగర్, అనంతపురం లో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ…
త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గం మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లో ఓపిక పట్టిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. 70 ఏండ్లలో కాంగ్రెస్, టిడిపి వాళ్ళు తాగు, సాగు నీరు ఇచ్చారా? అని…