హైదరాబాద్ లోని హైటెక్స్ లో పలు సంస్థల ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ సదస్సు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో హైదరాబాద్ నగర అభివృద్ధిపై బీఆర్ఎస్ విజన్ ను ఆయన వివరించారు. ఆరున్నర సంవత్సరాలు మాత్రమే మాకు సమర్థవంతంగా పనిచేసే అవకాశం దొరికింది.. ప్రజల కోసం పని చేశామన్నారు. అవతల 60 ఏళ్లు పాలన చేసిన వాళ్ళు ఉన్నారు.. ఒక వైపు ఐటీ పెరిగింది.. అదే సమయంలో వ్యవసాయం పెరిగింది.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ అయ్యింది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read Also: Bigg Boss 7 Telugu: తారుమారైన ఓటింగ్.. టాప్ లో ఆ కంటెస్టెంట్.. ఫైనల్ కు వెళ్ళేది వాళ్లే?
ఒక వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయి.. మరో వైపు పచ్చదనం పెరిగింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రతిపక్షాలు తీసుకువస్తున్నారు.. మాకు అహంకారం లేదు….తెలంగాణ పై చచ్చెంత మమకారం ఉంది.. మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చిన తర్వాత నిరక్ష్యరాస్యత లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం.. అప్పు తీసుకుని ఇళ్ళు కొంటున్న మధ్య తరగతి వారికి ప్రభుత్వం తరపున సహకారం ఇవ్వడంపై కేసీఅర్ ఆలోచన చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read Also: Bandi Sanjay: రైతులకు మోడీ రూ.24 వేలు ఇస్తే.. కేసీఆర్ ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే
మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధిపై కొన్ని ఆలోచనలు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటిని అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రధాన రోడ్లలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది.. మెట్రో రైలు స్టేషన్ల నుంచి శటిల్ సర్వీసులు తీసుకు వస్తాం.. హైదరాబాద్ లో మరిన్ని పార్క్ లను , గ్రీనరీనీ అభివృద్ధి చేస్తుంది అని ఆయన చెప్పారు. నగరంలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పెంచుతాం.. హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించేందుకు ఈవీ వెహికిల్స్ కు ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో 24 గంటలు నిరంతర నీటిని ఇస్తాం.. ట్రాఫిక్ గురించి ఎక్కువగా కార్లలలో తిరిగే వారే ఫిర్యాదు చేస్తారు.. ప్రైవేట్ ట్రాన్స్ ఫోర్ట్ బలంగా ఉంటేనే హైదరాబాద్ గ్లోబల్ నగరం అవుతుంది.. వచ్చే అయిదేళ్లలో మెట్రో 250 కిలోమీటర్లు విస్తరణ చేస్తున్నాం.. మెట్రోను డబుల్ డెక్కర్ చేయాలని ఆలోచన ఉంది.. ఆ తరవాత ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో తీసుకురావాలని ఆలోచన చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.