తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, అది దేశంలో ఎక్కడా లేనంత సులభతర వాణిజ్య విధానాల ద్వారా సాధ్యమైందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మలేషియా రాష్ట్రం కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం ద్వారా, మలేషియా పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తాము వారికి ఆహ్వానాన్ని వ్యక్తం చేశారు.
KTR-Harish Rao: నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పర్యటించనున్నారు. ముందుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.30 గంటలకు పట్టణ శివారులోని ఇర్కోడు గ్రామంలో ఆధునిక కబేళాను ప్రారంభిస్తారు.
Minister KTR: నేడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నియోజక వర్గంలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో పర్యటించనున్నారు.
KTR Tweet: ఆకాశంలో సగం కాదు.. సంక్షేమంలో సగం కాదు.. అగ్రభాగమని మంత్రి కేటీఆర్ అన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్‌ను ఘనంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా ఈ రన్ కొనసాగింది.
రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, రెవెన్యూ, టీ-సెర్, మహిళ, ట్రాన్స్ జెండర్ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రసంగించారు.