Minister KTR: నేడు సిరిసిల్ల, రేపు సిద్దిపేట.. మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: నేడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నియోజక వర్గంలో పర్యటించనున్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఉదయం 9.30 నుంచి 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సాయిమణి గార్డెన్‌లో జరిగే వివాహ వేడుకలకు బీఆర్‌ఎస్ యువనేత కొర్రి ఎ నీల్‌కుమార్ హాజరుకానున్నారు.
మధ్నాహ్నం 12.30 గంటలకు యువజన నాయకుడు సుధాకర్ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు. మున్నూరుకాపు సంఘ కల్యాణమండపంలో జరిగే వివాహ వేడుకలకు టీఆర్‌ఎస్‌వీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు వస్త్ర వర్తక సంఘం భవనంలో వస్త్ర వర్తక సంఘం నూతన కేడర్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి, 3 గంటలకు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
Also Read
Read also: iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే
ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారికి ఆనుకుని నిర్మించిన ఐటీ టవర్ ను రేపు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రారంభించనున్నారు. జూలైలో నిజామాబాద్ ఐటీ హబ్, ఆగస్టులో నల్గొండ ఐటీ హబ్ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉంది.
సిద్దిపేట పట్టణ శివారు నాగులబండ వద్ద రాజీవ్ రహదారికి ఆనుకుని ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మించింది. ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీతో పాటు, పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సమీపంలో త్రీ స్టార్ హోటళ్లు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జీప్లస్ విశాలమైన 3 ఎకరాల స్థలంలో రూ.63 కోట్లతో 4 అంతస్తుల ఐటీ టవర్‌ను నిర్మించింది. ఈ టవర్ నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. అదే రోజు ఐటీ శాఖ కార్యదర్శి పలు కంపెనీలతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. గతేడాది నిర్మాణ పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేశారు. ఐటీ టవర్ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు స్థానికంగా ఐటీ ఉద్యోగాలు రానున్నాయి.
Viral: మండే ఎండలో ఒంటే దాహం తీర్చిన లారీ డ్రైవర్..
తాజావార్తలు
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!