సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
Minister ktr: తెలంగాణ సాధన దేశం అనుసరించే స్థాయికి చేరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
CM KCR: తెలంగాణలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే లు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR: జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Kishan Reddy: తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే గిరిజనులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని అన్నారు.
CM KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పండుగ నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.