BIG BREAKING: రేపటి ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి సోనియాగాంధీ పర్యటన పై ఇంకా క్లారటీ రాలేదు. ఢిల్లీలో ఎండల కారణంగా సోనియా రాక అనుమానమే అంటూ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సోనియాగాందీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు హాజరు కావడం లేదని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేశాయి. అస్వస్థత, సూర్యరశ్మి కారణంగా, డాక్టర్ల సలహా మేరకు ఆమె తన పర్యటనను రద్దు చేసుకుందని తెలుస్తుంది. అయితే దీనిపై తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని ప్రసారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read also: Tamil Nadu: వీరప్పన్ ఎన్కౌంటర్లో భాగమైన పోలీస్ సస్పెండ్.. రిటైర్మెంట్కు ఒక్క రోజు ముందే..!
పరేడ్ గ్రౌండ్స్ వేదికపై భారీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందేశాన్ని ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని స్వయంగా ఆవిర్భావ వేడుకలు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె కూడా సానుకూలంగా స్పందింది హామీ ఇచ్చారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆమె అనారోగ్యం కారణంగా.. వైద్యుల సలహా మేరకు యాత్రను రద్దు చేసుకున్నారు.
నైట్ షిఫ్ట్ చేస్తున్నారా..? సంతాన సమస్యలు ఖాయం