Double Murder : సంక్రాంతి పండుగ వేళ నార్సింగి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పుప్పాల్‌గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనతో నార్సింగి పరిసర ప్రాంతాల్లో తీవ్ర సంచలనం రేగింది. సంక్రాంతి సందర్భంగా పలు చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగురుతుండగా, అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి…
సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం ఉత్తరపల్లిలో యువకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిన్న దారుణ హత్యకు గురైన రాజు (35) హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భర్తని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. విచారణలో ఏమీ తెలియనట్టు అమాయకత్వం ప్రదర్శించిన భార్య సుమలతను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం… సుమలత 12 ఏళ్ల క్రితం రాజును ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుమలతపై ప్రేమతో రాజు తన…
Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల…
వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తే.. పదోపరకు ఆదాయం వస్తుందని, పంటతోపాటు పంట చేనులో గంజాయి మొక్కలు సాగిస్తే లక్షల లాభం గడించవచ్చునని భావించిన వ్యక్తికి సంగారెడ్డిలో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 25000 జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చారు.