జనగామ జిల్లా పాలకుర్తి మండల మల్లంపల్లి గ్రామం బిక్య నాయక్ గ్రామపంచాయితీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దర ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులు మైనర్ బాలిక బానోతు దీపిక, 22 సంవత్సరాల గుగులోతు రాజుగా గుర్తించారు. పల్లిప్రకృతి వనంలో రాత్రి 11 గంటల సమయంలో తీసుకొచ్చి అమ్మాయికి బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ప్రియుడు పురుగుల మందు తగినట్టు స్థానికుల అనుమానం…
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచర్లు గొలుసులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎల్బీనగర్ సంతోషి మాత దేవాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించామన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగత్. డిసెంబర్ 3, 4 తేదీలలో దేవాలయంలో అమ్మవారి నగలు చోరీ గురయ్యాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాం. సీసీటీవీ కెమేరాలతో పాటు దర్యాప్తు చేపట్టాం అన్నారు. ఇది అంతరాష్ట్ర దొంగల పని అని గుర్తించామన్నారు. ఐటి , సైబర్ క్రైమ్, స్పెషల్ టీమ్స్ తో గాలింపు చేపట్టాం. అంతరాష్ట్ర…
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కొడుకుపై కక్ష పెంచుకున్న రెండో భర్త అతడిని అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అరుణ అనే మహిళ భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. గద్వాల్ లోని ఓ కంపనీలో పని చేస్తూ ఆమె పిల్లలను చదివిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అదే కంపెనీలో పనిచేసే వినయ్ తో…