Double Murder : సంక్రాంతి పండుగ వేళ నార్సింగి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పుప్పాల్‌గూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనతో నార్సింగి పరిసర ప్రాంతాల్లో తీవ్ర సంచలనం రేగింది. సంక్రాంతి సందర్భంగా పలు చిన్నారులు, యువకులు కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి అనంత పద్మనాభస్వామి గుట్టపైకి వెళ్లారు. గాలిపటాలు ఎగురుతుండగా, అవి తెగి పొదల్లో పడటంతో అక్కడి యువకులు వాటిని తీసుకునేందుకు వెళ్లారు. అయితే, పొదల్లోకి వెళ్లిన యువకులు అక్కడ రెండు మృతదేహాలను చూసి భయంతో వణికిపోయారు.
Bengaluru: బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. కాంక్రీట్ నిర్మాణాల పరిశీలనకు ఏఐ ఉపయోగించాలని నిర్ణయం
యువకులు వెంటనే ఆ ప్రాంతం నుంచి పరుగులు పెట్టి 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించేందుకు రంగంలోకి దిగాయి. నార్సింగి పోలీసులు ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో మృతుల్లో ఒకరు మహిళగా, మరొకరు వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసి, ఆపై మృతదేహాన్ని తగలబెట్టినట్లు గుర్తించారు. మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిన్నందున ప్రాథమికంగా గుర్తుపట్టడం కష్టమవుతోంది.
ఘటనా స్థలంలో ఖాళీ మద్యం సీసాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మద్యం మత్తులో ఈ హత్యలు జరిపి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణమైన ఘటన నార్సింగి ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమైంది.
Harihara Veeramallu: వీరమల్లు మాట చెప్తే వినాలి.. పవన్ పాడిన పాట వచ్చేస్తోంది!