Drugs : హైదరాబాద్‌లో ఓ తండ్రి తన కూతురి భవిష్యత్తును రక్షించేందుకు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆవేదన కలిగిస్తోంది. ఏడేళ్లుగా మత్తుకు బానిసైన యువతిని చూసి, ఆమె జీవితంలో మార్పు రావాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన తండ్రి చివరకు గట్టి నిర్ణయం తీసుకుని, ఇన్‌ఫార్మర్‌గా మారాడు. తన కుమార్తె తనను తానే నాశనం చేసుకుంటుండటాన్ని చూసి కన్నతండ్రి తట్టుకోలేక, TG NABB అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి ఆమెను పట్టించేందుకు సహకరించాడు. ఈ మహిళ…
Veera Raghava Reddy : గతంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి దాడికి గురయ్యాడు. గురువారం (మే 1, 2025) కండిషన్ బెయిల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసి తిరిగి వస్తున్న వీర రాఘవరెడ్డి…
భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డోకే జయరామ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టింది. ఆమెకు ఇక పిల్లకు పుట్టక పోవడంతో మగపిల్లాడి కోసం రెండో వివాహం చేసుకున్నాడు జయరామ్.
Crime News: మేడ్చల్ జిల్లా అంకుశాపూర్‌లో ఆస్తి గొడవలో బావ కుట్ర బయట పడింది. తన భార్య లావణ్య తమ్ముడు బోనాల ఈశ్వర్ కుటుంబాన్ని హత్య చేయించేందుకు సుఫారీ ఇచ్చినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బోనాల ఈశ్వర్ సోదరి లావణ్యకు 2009లో మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. అప్పట్లో కట్నంగా ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ, 2020లో శ్రీనివాస్–లావణ్య దంపతులు మరింత ఆస్తి కావాలని వాదనలు పెట్టారు.…
Bank Robbery : ఇప్పటి దొంగలకి టెక్నాలజీ స్పూర్తి కలిసొచ్చిందో ఏమో కానీ, బ్యాంకు తాళం పగలగొట్టడం పాత ఫ్యాషన్ అయిపోయిందట. “తాళాలు వదిలేయండి సార్… డైరెక్ట్ గోడే తీసేద్దాం” అన్న కొత్త ట్రెండ్ మొదలైంది. డిసెంబర్ 12న రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఓ వినూత్న దొంగతన యత్నం చోటు చేసుకుంది. దొంగలు ఏం చేశారు అంటే – అర్ధరాత్రి టూల్స్ తో హమ్మయ్య అనుకుంటూ బ్యాంకు గోడకే కన్నం పెట్టేశారు! అన్నట్లు, ఇది…
Murder : ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణ హత్య ఒక గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28) గుర్తు తెలియని దుండగుల చేతిలో బలైపోయాడు. ఆదివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది. విజయ్ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడికి…
Gudimalkapur : పాత బస్తీ చంద్రాయణగుట్ట చెందిన నలుగురు యువకులు (వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ) 1. అబ్దుల్ రెహమాన్ బా నయీం, 2. సౌత్ బిన్ సైది, 3. మొహమ్మద్ సుల్తాన్ పటేల్ (అప్స్కాడింగ్) 4. మహమ్మద్ సులేమాన్ పటేల్ (అప్స్కాడింగ్) ఒక కిడ్నాప్కి పాల్పడ్డాడు. కత్తులు చూపించి కిడ్నాప్ కి పాల్పడినట్టు తెలుస్తుంది. కిడ్నాప్ కి గురైన వ్యక్తి పేరు నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి, పాతబస్తీ చంద్రాయన గుట్ట…
అమీన్ పూర్ లో తల్లి తన కడుపున పుట్టిన పిల్లలకు విషమిచ్చి కడతేర్చిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అమ్మతనానికి మాయని మచ్చగా రజిత అనే మహిళ ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను మృత్యుఒడికి చేర్చింది. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రజితను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి రజితతో పాటు ప్రియుడు శివను అరెస్టు చేసి…
Shocking Incident : సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విశ్వాసం, ప్రేమ, బాధ్యతలు అనే భావనలు కొందరికి వ్యర్థమైపోతున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకూ, స్వార్థ ఆకాంక్షలకూ బలవుతున్నాయి. ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమిన్‌పూర్‌లో చోటుచేసుకుంది. రజిత (45) అనే మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భర్తను, పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర…
పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో దుండగులు సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు. సాయికుమార్ జన్మదినం రోజే హత్య కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది.