ఖమ్మం నగరంలో రౌడీయిజం పెరిగిపోతుంది.గంజాయి మత్తులో విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కార్పోరేషన్ పరిదిలోని గోపాల పురం వద్ద హైవే మీద కిరాణ దుకాణంమీద కొంత మంది దుండగులు పడి దౌర్జన్యం చేశారు.
Betting Apps : ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం మరో కుటుంబాన్ని కూలదోసింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోస్టల్ ఉద్యోగి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మృతుడు నరేష్ (విజయనగరం జిల్లా బొబ్బిలి వాసి) భార్య, కూతురుతో వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో మునిగిపోయిన నరేష్ భారీ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాడు. గెలుస్తాననే ఆశతో మరింతగా బెట్టింగ్ చేస్తూ చివరికి సుమారు రూ.15 లక్షల అప్పులు…
సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు.
Srushti Case : సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ నేడు ముగియనుంది. కోర్టు ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించగా, గత నాలుగు రోజుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొకరుగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాధితులు బయటకు వస్తున్నారు. నల్గొండకు చెందిన జంట నుంచి రూ.44 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన జంట నుంచి రూ.18 లక్షలు, మరో NRI జంట నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు…
Srushti IVF: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సృష్టి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మహిళలే కావడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్యాప్తు వివరాల ప్రకారం, అరెస్టయిన ఈ ముగ్గురు మహిళలు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువుల క్రయ విక్రయాలలో వీరు నమ్రతకు నేరుగా సహకరించారు. ఈ సేవలకు…
మీ తాళం చెవితోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు తెలుసా? అలాంటి దొంగలు కూడా హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. తాజాగా ఓ యువతి అలాగే దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. Also Read: Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్ ఇంటికి తాళం వేసి షూ స్టాండ్‌లోనో, పక్కన కిటికీలోనో.. చెట్ల పొదల్లోనో తాళం చెవి దాచేస్తున్నారా? ఐతే మీ తాళం చెవితోనే మీ ఇంటిని దోచేస్తారు..…
డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అత్తని హత్య చేయాలని ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్ పెట్టాడు.…
Murder : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. తొడబుట్టిన వాళ్లనే కాటికి పంపుతున్నారు కొందరు దుర్మార్గులు. మెదక్ జిల్లాలో చేతబడులు చేస్తున్నాడని అనుమానంతో సొంత అన్ననే కిరాతకంగా హత్య చేశాడు తమ్ముడు. కసి తీరా పీక కోసి కూల్ అయ్యాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు మంక్త్యా నాయక్, మోహన్ నాయక్. ఇద్దరు సొంత అన్నదమ్ములు.. సీన్ కట్ చేస్తే ఇగో ఇలా అన్న.. మంక్త్యా నాయక్ని తమ్ముడు మోహన్ అతి కిరాతకంగా బాండ రాళ్లతో…
Baby For Sale : నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్లో ఓ ఆడ శిశువు విక్రయించే ఘటన కలకలం రేపుతోంది. ఐదో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని, తాము పోషించలేమని తల్లిదండ్రులే అమ్మేశారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తోంది. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులు ఇప్పటికే నలుగురు పిల్లల తల్లిదండ్రులు. ఐదవ సంతానంగా పుట్టిన ఆడపిల్లను స్థానికుల అనుమానంతో చైల్డ్లైన్కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై కేసు నమోదు…
ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది.