Jagtial Bride Suicide: ఔను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు, ఇరు కుటుంబాలను ఒప్పించి మరి రెండు కుటుంబాల అనుమతితో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో గానీ చిన్నపాటి మనస్పర్థలతో ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. Read Also: Israel-Hamas: తక్షణమే బందీలను విడుదల చేయండి.. హమాస్‌కు ఇజ్రాయెల్ సూచన వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన…
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది. గ్రామానికి చెందిన డ్రైవర్ ఎదురగట్ల సతీష్ (25)ను, అతని ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హతమార్చారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ హైదరాబాద్ లింగంపల్లి లోని ఇంట్లో రెండు నెలలుగా ఇంటి పని చేస్తుంది. పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో రెండు ఎకరాల భూమి ఉంది.
హైదరాబాద్‌లో మహిళల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వై స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోక ముందే రాజేంద్రనగర్ కిస్మత్‌పురా వద్ద మరో మహిళ మృతదేహం.. నగ్నంగా పడి ఉంది.
అన్నం పెట్టే బ్యాంకుకే కన్నం పెట్టాడు. రోజుకింత బంగారం తీసుకెళ్లాడు. ఒక్కటి రెండు కాదు బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన 402 ఖాతాలకు చెందిన 20 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు తీసుకెళ్లి వేరే బ్యాంకుల్లో తాకట్టుపెట్టి డబ్బులు దారి మల్లించాడు.
రాంగ్ కాల్‌లో పరిచయం.... ఆపై ప్రేమ ....పెళ్లి ... పిల్లలు ...ఇలా సంతోషంగా సాగుతున్న జీవితంలో భార్య తప్పటడుగులు.... భర్త పెంచుకున్న అనుమానంతో , ప్రేమించి పెళ్లాడిన భార్యను దారుణంగా హతమార్చి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త.
కట్నం ఎంత ఇచ్చినా.. కొంత మంది కిరాతక భర్తలు సంతృప్తి పడడం లేదు. ఇంకా ఇంకా డబ్బులు కావాలని అని.. భార్యలను వేధిస్తూనే ఉన్నారు. వారి వేధింపులకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అంతే కాదు అడిగినంత అదనపు కట్నం తీసుకు రాకుంటే అంతే సంగతులు.
Crypto Scam : క్రిప్టో కరెన్సీ.. ఇదొక ఊగిసలాట ట్రేడింగ్ దందా. నష్టాలు హైరిస్క్‌లో ఉంటాయి. కానీ కొంత మంది అధిక లాభాలు ఆశ చూపిస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెడితే మీ జీవితమే మారిపోతుందని చెబుతున్నారు. కానీ అమాయక జనం మాత్రం అందులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.
Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. ఈ ముఠా నాయకుడు నాందేడ్‌కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్థరాత్రి రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులే…
Cows Thieves: కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు దొంగలు. ఇప్పటి వరకు ధనవంతుల ఇండ్లు టార్గెట్ చేసి ఖరీదైన బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసుకుని వెళ్లేవారు. ఇప్పుడు కొంత మంది దొంగలు రోడ్ల మీద ఉన్న పశువులను కూడా వదలడం లేదు. అర్థరాత్రి వచ్చి వాటిని దర్జాగా ఎత్తుకు వెళ్లిపోతున్నారు. మొన్న హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్.. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇంతా చేసి వారు దోచుకు వెళ్లేది ఏదైనా ఖరీదైన…