Hyderabad Thief: తస్మాత్ జాగ్రత్త.. మీ తాళంతోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు!
- జగద్గిరిగుట్టలో దొంగతనం
- ఆరోహి అలియాస్ బేబీ అరెస్ట్
- ₹2.21 లక్షల బంగారం, వెండి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ తాళం చెవితోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు తెలుసా? అలాంటి దొంగలు కూడా హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. తాజాగా ఓ యువతి అలాగే దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Also Read: Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్
Also Read
ఇంటికి తాళం వేసి షూ స్టాండ్‌లోనో, పక్కన కిటికీలోనో.. చెట్ల పొదల్లోనో తాళం చెవి దాచేస్తున్నారా? ఐతే మీ తాళం చెవితోనే మీ ఇంటిని దోచేస్తారు.. జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు కూడా హైదరాబాద్‌లో తిరుగుతున్నారని చెబుతున్నారు. మనం చెప్పుకోబోయే ఈ కిలాడీ లేడీ కూడా అదే కేటగిరీ. జగద్గిరిగుట్ట పరిధిలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆ దొంగతనం చేసింది ఓ యువతి. ఆమె పేరు ఆరోహి అలియాస్ బేబీ. స్వస్థలం ఉత్తర ప్రదేశ్. కానీ హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చింది.
Also Read:Jyothi Krishna: క్రిష్ కథ అందుకే మార్చేశా.. అదే కిక్కిచ్చింది!
ఆల్విన్‌కాలనీకి చెందిన వి.చిరంజీవి ప్రైవేట్‌జాబ్ చేస్తుంటాడు. ఈ నెల18న పిల్లలను స్కూల్లో దిగబెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి… తాళం చెవిని చెప్పుల స్టాండ్‌లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. గంట సేపటికి తిరిగి వచ్చి చూస్తే తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో ఉన్న 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి మాయమైంది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఈ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాలు జల్లెడ పడ్డారు. దీంతో ఆరోహి అనే యువతి దొంగతనం చేసిందని గుర్తించారు. సనత్‌నగర్‌లోని మధునగర్‌లో ఉంటున్న ఆరోహి.. ఇంటింటికీ తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముతుంటుంది. అలా తిరిగే సమయంలో తాళం వేసిన ఇళ్లు రెక్కీ నిర్వహిస్తుంది. ఆ తర్వాత వాళ్లు పెట్టే కీ ద్వారానే చోరీ చేస్తుంది. ఆమెకు లగ్జరీ లైఫ్అంటే ఇష్టం. గోవా, ముంబైతో పాటు దేశంలోని మేజర్ సిటీస్‌కు వెళ్లి లైఫ్‌ను నచ్చినట్టు ఎంజాయ్ చేయాలని ఆశ. ఆమె చేస్తున్న పనితో ఎక్కువ డబ్బులు రాకపోవడంతో లైఫ్‌ను తాను అనుకున్నట్టు మలుచుకోవడానికి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయింది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..