Srushti IVF: సృష్టి కేసులో సంచలన మలుపు.. భారీ నెట్వర్క్ బహిర్గతం
- సృష్టి కేసులో 11కి చేరిన అరెస్టులు.. ముగ్గురు మహిళలు నెట్‌వర్క్‌లో కీలకం
- తెలుగు రాష్ట్రాల నుంచి మరో నాలుగు రాష్ట్రాల వరకు విస్తరించిన నమ్రత ఏజెంట్ల బలమైన నెట్‌వర్క్
- IVF క్యాంపుల ముసుగులో సరోగసి మోసం.. 30 నుంచి 50 లక్షల వసూళ్లు
- పిల్లలను కొనుగోలు చేసి సరోగసి పేరుతో అప్పగింత.. భారీ మోసంపై దర్యాప్తు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srushti IVF: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న సృష్టి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ మహిళలే కావడం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. దర్యాప్తు వివరాల ప్రకారం, అరెస్టయిన ఈ ముగ్గురు మహిళలు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువుల క్రయ విక్రయాలలో వీరు నమ్రతకు నేరుగా సహకరించారు.
ఈ సేవలకు ప్రతిఫలంగా డాక్టర్ నమ్రత ఏజెంట్లకు భారీగా నజరానాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా నమ్రతకు మహిళలతో కూడిన విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
పోలీసుల ప్రకారం, నమ్రత తన నెట్వర్క్‌ను విస్తరించడానికి పలు జిల్లాల్లో IVF కోసం ఉచిత క్యాంపులు నిర్వహించేది. క్యాంపులకు వచ్చిన దంపతులకు “IVF ద్వారా పిల్లలు కలుగుతాయి” అని నమ్మబలికేది. అయితే, IVF బదులు వారిని సరోగసికి రెఫర్ చేసి మోసం చేసేది. సరోగసి కోసం దంపతుల నుండి ₹30 లక్షల నుండి ₹50 లక్షల వరకు వసూలు చేసేది.
శిశువుల క్రయ విక్రయాల మోసం ఈ మోసపూరిత ప్రక్రియలో భాగంగా నమ్రత.. పిల్లలను కొనుగోలు చేసేది. వాటిని సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా చూపించి దంపతులకు అప్పగించేది. ఈ విధంగా అనేక కుటుంబాలను భారీగా మోసం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసులు ప్రస్తుతం ఈ నెట్వర్క్ వ్యాప్తి, ఆర్థిక లావాదేవీలు, మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సహచరులపై మరింత దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక బహిర్గతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Nitin Gadkari: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కొనియాడిన నితిన్ గడ్కరీ..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..