Tragic: హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ కొడుకు తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. మాదాపూర్‌కు చెందిన హనుమంతు అనే వ్యక్తి తన కొడుకు రవీందర్ చదువు కోసం సుమారు ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే ఆ మొత్తాన్ని చదువుల మీద కాకుండా, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి పోగొట్టేశాడు రవీందర్. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తీవ్రంగా మందలించాడు. Kasam…
మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. కష్టమైనా, సుఖమైనా కలిసే ఉంటామని బాసలు చేసిన ఆ భర్త.. కట్టుకున్న భార్యనే బలి తీసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌లో కలకలం సృష్టించింది. అంతే కాదు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డ్రామా రక్తికట్టించినా.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి ఆ భర్త కుట్ర బయట పడింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ స్వస్థలంకు చెందిన రామాయంపేట రమ్యతో 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన…
జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందన్న కారణంతోనే అంజలిని.. కూతురు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కుమార్తె సహా ఆమెకు సహకరించిన శివ, అతని తమ్ముడు యశ్వంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
Gadwal Murder : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తేజేశ్వర్‌ను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేట్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే యువతిని ప్రేమించి, పెద్దల వ్యతిరేకతను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో…
Gadwal Murder : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో…
Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్‌కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్‌ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త…
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కలకలం రేపిన ఇద్దరు చిన్నారుల హత్య కేసుకు సంబంధించి తండ్రే కాలయముడని పోలీసులు గుర్తించారు. ఈ నెల 12న వెలుగులోకి వచ్చిన చిన్నారుల హత్య వ్యవహారం కలకలం రేపింది. తండ్రి రవిశంకర్ కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు డ్రామాలు ఆడినప్పటికీ.. పిల్లలను చంపి పరారైనట్టు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. మైలవరం చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్. NTR జిల్లా మైలవరం చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్.. తండ్రే ఈ హత్యలు చేసినట్లు నిర్ధారణ.…
Liquor Smuggling : ఆదిలాబాద్ జిల్లా మద్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మహారాష్ట్ర నుంచి మద్యం సీసాలను కొత్త ఎత్తుగడలతో తరలిస్తున్న కేటుగాళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల నివేదిక ప్రకారం.. దేశిదారు మద్యం తరలింపులో నూతన మార్గాలు వెతుక్కుంటూ ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్లను దుండగులు ఉపయోగిస్తున్నారు. మద్యం సీసాలను ఈ జాకెట్లలో దాచిన వీరంతా వాటిని ఒంటిపై వేసుకొని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ కుట్ర బట్టబయలైంది.…
అత్తింటి వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆఫీసుకు వెళ్లి కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని.. దుర్గం చెరువులో శవమై తేలింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతికి అత్తింటి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 3 నెలల క్రితమే వివాహం జరిగిన ఆమె కాపురంలో కట్నం మహమ్మారి చిచ్చు పెట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న సుష్మ. ఈ ఫోటోలో మీరు చూస్తున్న యువతి పేరు సుష్మ.. మాదాపూర్‌లోని డైబోల్డ్…
కొమురం భీం జిల్లాలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. అదృశ్యమైన యువతి ఆధార్ కార్డు ఏడాది తర్వాత ఇంటికి రావడంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు కూపీలాగారు. ఆ యువతి విషయం వెలుగులోకి రావడంతోనే మరో యువతి ని సైతం విక్రయించినట్లు తేలింది. 9 మంది ఓ ముఠాగా ఏర్పడి యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా అక్రమ రవాణాకు తెరలేపారు. ఆధార్ కార్డు కాస్త క్లూ ఇవ్వడంతో మొత్తం కేసును లాగారు పోలీసులు. ఇద్దరినే అమ్మేశారా?…