Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు. నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో నేను కూర్చోవాలా? అంటూ ప్రశ్నించారు. నిన్న నియోజకవర్గ పర్యటనల వల్ల థాక్రేను కలవలేకపోయానని అన్నారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు మీటింగ్ రాలేదో అడగండి ముందు అంటూ కోమటిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నిసార్లు నియోజకవర్గ పనులతో కలవలేమన్నారు. నా ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీ నాకు చెప్పారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ పదవి నుండి మాణిక్కం ఠాగూర్ ను పార్టీ జాతీయ నాయకత్వం తప్పించింది. దీంతో..తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యహరాల ఇంచార్జీగా నియామాకమైన తర్వాత మాణిక్ రావు థాక్రే నిన్న హైద్రాబాద్ కు వచ్చారు. ఈనేపథ్యంలో.. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత థాక్రే పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో థాక్రే సమావేశాలు నిర్వహించారు. ఇవాళ కూడా పార్టీ నేతలతో థాక్రే సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా..గతఏడాది డిసెంబర్ మాసంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర పర్యటనకు వచ్చే ముందు గాంధీభవన్ కు రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఠాక్రే ఫోన్ చేశారు. అయితే తాను గాంధీ భవన్ కు రానని వెంకట్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అంతే దీంతో హైదర్ గూడలోఉన్న థాక్రేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశంమయ్యారు. ఖర్గేతో భేటీ అయిన మరునాడే ప్రధాని మోడీతో కూడా వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే..తన నియోజకవర్గంలో అభివృద్దికి సంబంధించిన నిధుల విడుదల విషయమై మోడీతో చర్చించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే..
Chiranjeevi: రోజాపై కామెంట్ చేయను.. గతంలో తనతో కలిసి అలా..