Revanth Reddy: కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. ఇప్పుడు కేసీఆర్ దారిలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ చేస్తున్న రాజకీయ విషప్రచారంలో ఈటెల కూడా పాత్ర ధారి అన్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టె సంస్కృతి ఈటెలకు ఇష్టం లేదన్నారు. హుజురాబాద్ లో వందల కోట్లు ఈటెల ఖర్చు పెట్టారని, మునుగోడులో ఈటెల చేతుల మీద నుండే ఖర్చు పెట్టించారన్నారు. కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. కేసీఆర్ దారిలోనే వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బుల ఖర్చుకి ఈటెల వ్యతిరేకి అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Read also: Balakrishna: నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
గవర్నర్.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక మీద చూసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం విషయంలో గొడవ సరికాదని.. ప్రభుత్వం వెంటనే గవర్నర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఈ జాతి గొప్పదనం స్మరించుకోవాల్సిన సమయం ఇది అన్నారు రేవంత్ రెడ్డి. అబద్ధపు పునాదుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిందని, వాళ్ళ విధానాలు చూస్తుంటే.. రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పబ్లిక్ సెక్టార్ ని పెంచింది.. బీజేపీ ప్రయివేట్ చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ లను అమ్మడానికి ఓ మంత్రినే పెట్టారు మోడీ అన్నారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలు అమ్మడంతో రిజర్వేషన్లు పోతున్నాయని తెలిపారు. దళిత.. గిరిజనులు ఆలోచన చేయాలని అన్నారు. జర్వేషన్ స్ఫూర్తి దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
Read also: MLC Kavitha: గవర్నర్ తమిళిసైకి కవిత కౌంటర్.. వాటినే మళ్లీ అడిగినందుకు ధన్యవాదాలు
9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడ్డారు.. కేసీఆర్… కూడా అంతే అన్నారు. ఓ పార్టీలో గెలిచి.. మరో పార్టీలోకి పోతే అత్యాచారం.. హత్య కేసులో వేసినట్టు ఉరిశిక్ష వేయాలని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే.. అత్యాచారం కేసులో ఎలాంటి శిక్షలు వేస్తారో అలాంటి శిక్షలు వేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులు దేశానికి ప్రమాదంగా మారిందని మండిపడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేసి.. చర్యలు తీసుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 6 నుండి ప్రతీ గడప వెళతామన్నారు. ఫిబ్రవరి 6 నుండి ప్రతీ గడప వెళతామన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ స్ఫూర్తి తో హాత్ సే హాత్ జొడో యాత్ర ప్రారంభం కానుందని..నిరంతరం పాదయాత్ర లో పాల్గొంటామన్నారు. పార్టీ ఆదేశించినట్టు పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy: గవర్నర్, సీఎంల మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక చూసుకోవాలి.. ఇది సరైన పద్దతి కాదు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!