Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Adilabad Battivikramarks Open Letter To Modi

Mallu Bhatti Vikramarka: మోడీ జీ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి.. తెలంగాణలో అడుగుపెట్టండి

Published Date :April 7, 2023 , 11:11 am
By NTV WebDesk
Mallu Bhatti Vikramarka: మోడీ జీ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పి.. తెలంగాణలో అడుగుపెట్టండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mallu Bhatti Vikramarka: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు,సింగరేణి సంస్థ ను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెండు లేఖలు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు. ఇక తాజాగా మోడీకి మూడు పేజీలు, 30 ప్రశ్నలతో బహిరంగ లేఖను భట్టి విక్రమార్క విడుదల చేశారు. తను సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాక మోడీ తెలంగాణలో అడుగు పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు.

30 ప్రశ్నలతో బహిరంగ లేఖ

Also Read

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
  • Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత

1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా?
2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ 9 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? దీనిపైన కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
3. మీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో 20 వేల కోట్లతో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? తెలంగాణ ప్రజలపట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు?
4. బయ్యారంలో ఉక్కుకర్మాగారం పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు? దీనిపైన స్పష్టతను ఇస్తారా?
5. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఈ నిధులు 2019 నుండి నిలిపివేయడానికి కారణాలు ఏమిటి?
6. మీరు అధికారం చేపట్టిన ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అయినా జాతీయో హోదా ఇచ్చారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అయిన పాలమూరు`రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు.
7. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఎటిఎం గా మారిందని విమర్శలు చేసే మీరు, మీ కేంద్రమంత్రులు, మీ పార్టీవారు దీనిపైన సిబిఐ లేదా ఇతర సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు? మీకు కేసీఆర్‌కు, బిజెపికి, బీఆర్‌ఎస్‌కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటి?
8. కేంద్రమంత్రిగా శ్రీ కేసీఆర్‌గారు పనిచేసినప్పుడు పాల్పడిన సహారా, ఇ.ఎస్‌.ఐ స్కామ్‌లపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఈ స్కామ్‌లపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
9. 2014 లో మీరు ప్రధానమంత్రి అయినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యాసంస్థలను తెలంగాణలో ఎందుకు నెలకొల్పలేదు? ముఖ్యంగా ఐ.ఐ.ఎం, ఐ.ఎస్‌.ఆర్‌, ఎన్‌.ఐ.డి, ట్రిపుల్‌ ఐటి, నవోదయ విద్యాలయాలు కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు?
10. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు? బిజెపి పాలిత రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు? దీనిపైన మీ సమాధానం ఏమిటి?
11. తెలంగాణ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటివాటా కేటాయింపుల విషయంలో ఎందుకు కేంద్రప్రభుత్వం తాత్సర్యం చేస్తోంది? సాగునీటి వాటాల కేటాయింపులపై ట్రిబ్యునల్లకు ఎందుకు రిఫర్‌ చేయడం లేదు?
12. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన నిధులను కూడా ఏవో సాకులు చెప్పి ఎందుకు నిలిపివేస్తున్నారు?
13. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాలకు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంత సహాయం అందించారు? తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు?
14. తెలంగాణ రాష్ట్రానికి ఈ 9 ఏళ్ల కాలంలో జాతీయ స్థాయి ఉన్న ఒక్కవిద్యాసంస్థ కానీ, మెడికల్‌ కళాశాలలు కానీ మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారా?
15. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయంను ఎప్పుడు ప్రారంభిస్తారు?
16. తెలంగాణలో అనేక డిఫెన్స్‌ సంస్థలున్నాయి? ఈ రాష్ట్రంలో ఢపిెన్స్‌ క్యారిడార్‌ కేంద్రప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదు?
17. నిజామాబాద్‌ పసుపు బోర్డు ఎప్పటి లోగా ఏర్పాటు చేస్తారు?
18. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి సంబంధమున్న మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు? మీకు, కేసీఆర్‌కు మ్యాచ్‌ఫిక్సింగ్‌ అయ్యిందా?
19. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలీండర్‌ ధరలు పెంచనని మీరు హామీ ఇవ్వగలరా? 2014 నుండి ఇప్పటివరకు ఈ 9 సంవత్సరాల కాలంలో వీటిపైన ఎన్నిసార్లు ధరలు పెంచారు?
20. 2014 ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమచేస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?
21. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు? ఇప్పటి వరకు ఎన్నికోట్ల ఉద్యోగాలను మీరు అధికారంలోకి వచ్చిన తరువాత కల్పించారు?
22. మీకు, అదానికి ఉన్న సంబంధం గురించి తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? దీనిపైన ఇప్పటికైనా నోరు విప్పుతారా?
23. అదాని పాల్పడ్డ కుంభకోణాల్లో మీ పాత్ర ఉందా? లేదా? ఈ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు?
24. మీ విద్యార్హతల గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డిగ్రీ సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తీర్పు ఇచ్చిన వ్యక్తి మా తెలంగాణ బిడ్డ. మీరు పాల్గొనే బహిరంగ సభలో మీరు మీ సర్టిఫికేట్‌ను ప్రజల సమక్షంలో చూపడానికి సిద్ధమా? కనీసం మీ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా అయినా మీ సర్టిఫికేట్‌ను షేర్‌ చేయగలరా?
25. 2014 లో మీరు అధికారం చేపట్టినప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు? ఎన్ని కొత్తగా ప్రారంభించారు? దీనిపైన వివరణ ఇవ్వగలరా?
26. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌కు మంజూరు అయిన ఐటిఐఆర్‌ (ఇంటిగ్రేటేడ్‌ ఇన్వెస్టిమెంట్‌ టెక్నాలజీ రీజియన్‌) ఎందుకు రద్దు చేశారు? దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకున్న కార్యక్రమాలు ఏంటి?
27. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత తెలంగాణలోని హైదరాబాద్‌ నగరం సాఫ్ట్‌వేర్‌ రంగానికి పుట్టినిల్లు. తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్టులు ఎందుకు ఇవ్వడం లేదు?
28. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రఖ్యాత ఫార్మాకంపెనీలున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో కూడా తెలంగాణలోని ఫార్మా కంపెనీయే కీలకపాత్ర పోషించిన విషయం మీకు తెలియంది కాదు. అంత ప్రాధాన్యత ఉన్న తెలంగాణకు ఫార్మాసిటిలకు కేంద్రప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదు?
29. ట్రెడీషనల్‌ మెడిసన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ నుండి మీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
30. బిజెపి – బీఆర్‌ఎస్‌ ఉన్న లోపాయకారి ఒప్పందాలను మీరు వెల్లడిరచగలరా? మీ కనుసన్నల్లోనే బీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేస్తున్నదన్న విషయం వాస్తవం కాదా? బిజెపికి – బీఆర్‌ఎస్‌, ఎఐఎంఐఎం ఇంకా కొన్ని పార్టీలు ‘బి’, మరియు ‘సి’ టీమ్‌లుగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.
Online games: ఆన్లైన్ గేమ్ లకు బానిసై.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • bjp
  • BRS
  • mallu bhatti vikramarka
  • telangana Congress

తాజావార్తలు

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!

  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions