Telangana Congress: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెరుకు సుధాకర్ మధ్య జరిగిన పంచాయితీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. చెరుకు సుధాకర్ కుమారుడికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనను బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని చెరుకు సుధాకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే చెరుకు సుధాకర్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
కాగా, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు సుహాస్‌ను చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సుహాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని సుహాస్ తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన తండ్రిని పరుష పదజాలంతో దూషించారన్నారు. చంపేస్తామని బెదిరించారని చెప్పారు. తమ ఆసుపత్రిని కూడా కూల్చేస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.
Read also: IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. ఫ్రాంఛైజీలను నిరాశపరిచిన ప్లేయర్స్
కోమటిరెడ్డి వివరణ..
చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్‌తో తాను మాట్లాడిన మాటలు ఉద్వేగపూరిత వ్యాఖ్యలు కావని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తన 33 ఏళ్ల రాజకీయాల్లో తన రాజకీయ ప్రత్యర్థులను, ఇతరులను ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. శత్రువులను సైతం దగ్గరకు చేర్చే తత్వం తనదని వ్యాఖ్యానించారు. తిట్లానుకుంటే కంటిన్యూగా ఫోన్ ఎందుకు చేస్తానని ప్రశ్నించారు.
నల్గొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ బలహీన వర్గాలకు ఇవ్వాలని పట్టుబట్టారని వివరించారు. తాను మాట్లాడిన విషయాలు కట్ అయ్యాయని, కొన్ని అంశాలు మాత్రమే లీక్ అయ్యాయని పేర్కొన్నారు. రికార్డు నెలకొల్పినట్లు తెలిసిందని, పార్టీలో చేరినప్పటి నుంచి చెరుకు సుధాకర్ వేధిస్తున్నారని ఆరోపించారు. తనను సస్పెండ్ చేయాలని కోరినందుకే బాధతో మాట్లాడానని వివరించారు. నకిరేకల్‌లో తనపై ఎవరు పోస్టర్లు వేయించారో తనకు తెలుసునని అన్నారు. తమ వాళ్లు చంపేస్తారేమోనన్న భయంతోనే అలా మాట్లాడానని పేర్కొన్న ఆయన తనపై చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రేకు ఫిర్యాదు చేశానని వివరించారు.
Parole to marry girlfriend: హత్య కేసులో నిందితుడు.. గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు పెరోల్..