TS Congress: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. ఈసారి ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Puvvada Ajay Kumar: కాంగ్రెస్ కు పవర్ ఇస్తే రైతులకు కరెంట్ కట్ అంటూ పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం మంచుకొండలో ధర్నాలో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
Bhatti Vikramarka: మోడీ పర్యటన వల్ల తెలంగాణ కు ఉపయోగం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. మోడీ పర్యటన వల్ల తెలంగాణకు ఉపయోగం లేదని అన్నారు.
Minister KTR: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి మతిస్థిమితం లేదని, ఆయన నోట్లో నుంచి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్, బీజేపీ మనిషి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటైందని, ఇది అదృష్టంగా భావిస్తున్నా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.