TS Congress: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. ఈసారి ఎలాగైనా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. అయితే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. కాగా, నిన్న చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కో చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించారు. అథారిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని నియమించింది.
దీంతో పాటు 37 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ పదాధికారులు, వివిధ శాఖల పార్టీ, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేకంగా నియమించారు. ఏఐసీసీ కూడా ఆహ్వానితులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు.. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఏఐసీసీ పరిశీలకులను ప్రధాన కార్యాలయం నియమించింది. వీరి నియామక ప్రతిపాదనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆమోదం తెలిపారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. వీరి నియామకం వెంటనే అమల్లోకి వస్తుంది.
Read also: Telangana: నేటి నుంచే బీసీ వృత్తిదారులకు లక్ష సాయం..!
17 లోక్‌సభ స్థానాల పరిశీలకులు..
* ఆదిలాబాద్- ప్రకాష్ రాథోడ్
* భువనగిరి- శ్రీనివాస్ మానె
* చేవెళ్ల- అల్లం ప్రభు పాటిల్
* హైదరాబాద్- ప్రసాద్ అబ్బయ్య
* కరీంనగర్- క్రిస్టోఫర్ తిలక్
* ఖమ్మం- ఆరిఫ్ నసీమ్ ఖాన్
* మహబూబాద్- పరమేశ్వర నాయక్
* మహబూబ్ నగర్- మోహన్ కుమార్ మంగళం
* మల్కాజిగిరి- రిజ్వాన్ హర్షద్
* మెదక్- బసవరాజ్ మాధవరావు పాటిల్
* నాగర్ కర్నూల్- పీవీ మోహన్
* నల్గొండ- అజయ్ ధరమ్ సింగ్
* జహీరాబాద్- సీడీ మెయ్యప్పన్
* నిజామాబాద్- బీఎం నాగరాజు
* పెద్దపల్లి- విజయ్ నామ్ దేవ్ రావు
* సికింద్రాబాద్- రూబీ ఆర్ మనోహరన్
* వరంగల్- రవీంద్ర ఉత్తమరావు దాల్వీ
Onion Price Hike: టమాట సెగకు ఉల్లి ఘాటు.. త్వరలో రూ.100కు పెరిగే ఛాన్స్..!