Indrakaran Reddy: రైతులు మంచిగా బతుకుతుంటే.. కాంగ్రెస్‌కు కడుపుమంటగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Indrakaran Reddy Fires On Congress Over Free Power Issue: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతులు మంచిగా బతుకుతుంటే.. కాంగ్రెస్‌కు కడుపుమంటగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు 3 గంటలు కరెంట్ చాలని అంటోందని గుర్తు చేశారు. నిర్మల్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో లాగా కరెంట్ సమస్యలు గానీ, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య గానీ లేదన్నారు. వ్యవసాయానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు సంక్షేమ పథకాలతో రాష్ట్ర రైతన్నల మోహంలో నవ్వు కనబడుతోందన్నారు.
V Hanumantha Rao: పప్పు అన్నారు, ఇప్పుడదే రాహుల్ పప్పా అయ్యాడు.. వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసలు రైతు కష్టాలు రేవంత్‌కి ఏం తెలుసు? ఏనాడైనా అరకపట్టి దుక్కి దున్నిండా? అని ప్రశ్నించారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై బషీర్‌బాగ్ వద్ద రైతులు ఆందోళన చేస్తే.. చంద్రబాబు కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ వద్దంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత కరెంట్ ఎందుకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ హయంలో కరెంట్ కష్టాలు, అప్పుల బాధలతో రైతన్న చితికిపోయాడని.. రైతన్నల ఆత్మహత్యలు కూడా చూశామని ఆరోపణలు చేశారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని.. రైతు ఆత్మహత్యలు లేవు, వలసలూ లేవని చెప్పారు. సాగునీరు, ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలతో అన్నదాతలు ఆర్థికవృద్ధి సాధించారన్నారు.
MP Margani Bharat: పవన్ కల్యాణ్ ఊసరవెల్లి.. ఢిల్లీలో యాక్టింగ్ చేస్తున్నాడు..
3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాలా? 3 పంటలకు సాగునీరు, కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో రైతులు నిర్ణయించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. అనంతరం రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, ‘3 గంటలు వద్దు 3 పంటలు కావాలని’ కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన ఆమోదించారు. ఇదే సమయంలో.. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్‌ని తొలగించాలమని తీర్మాణం చేస్తామని కూడా చెప్పారు. రైతుల్ని ముంచే వ్యక్తుల్ని పెట్టుకుంటారా? రాహుల్, సోనియా గాంధీలకు కళ్లు లేవా? అంటూ ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!