T.Congress: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ప్రజాభిమానం పొందేందుకు కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తనదైన శైలి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. విపక్షాలు కూడా తమకేమీ తక్కువ కాదన్నట్లుగా ఈసారి ఎలాగైనా గెలవాలని ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో శాసన సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది.
Read also: Hyderabad: నగరంలో జింక మాంసం విక్రయం.. రంగారెడ్డి, నల్గొండకు వాసులు అరెస్ట్..!
అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ కార్యకలాపాలు ముమ్మరం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీ ఈరోజు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 23 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరుకానున్నారు. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధిఖీ, విఘ్నేష్ మేవానీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
Read also: Rowdy Sheeter: బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య..!
ఈరోజు తొలిసారిగా భేటీ అవుతున్న ఈ రెండు కమిటీలు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర పార్టీల బలాబలాలు, కర్ణాటకలో అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న విధానం, ఎలాంటి ప్రక్రియను అనుసరించాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణా… బీఆర్ఎస్ ఎత్తులకు పైఎత్తులు వేయొచ్చని.. పార్టీ వ్యూహకర్త సునీల్ కానుగులు, పీసీసీ బృందాలు చేస్తున్న సర్వేలు ఏం చెబుతున్నాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలాంటి విధానాలు అనుసరించాలి. సర్వేలతో పాటు రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలనే సీనియర్ నేతల డిమాండ్, ఇతర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల మొదటి వారంలో తొలి జాబితా (టీ కాంగ్రెస్ ఎన్నికల సభ్యుల మొదటి జాబితా)ను ప్రకటించేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది.
Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్టేట్.. నేటి నుంచి వచ్చే మూడ్రోజులు వర్షాలే