* ఐపీఎల్ 2022: రసవత్తరంగా మారిన ఐపీఎల్ పోరు. ఫైనల్ లో తలపడనున్న రాజస్థాన్-గుజరాత్. ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్
* అనంతపురంలో సామాజిక న్యాయ భేరీ కార్యక్రమంలో భాగంగా వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ముగింపు సభ. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
*నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర. నంద్యాల నుంచి బయల్దేరి కర్నూలు చేరుకోనున్న మంత్రుల బస్సు
*తిరుపతి జిల్లా కోటలో నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు
*కోనసీమ జిల్లాలో 144 సెక్షన్ మరో వారం రోజులు పొడిగింపు. ఇంటర్నెట్ సేవలు మరో రోజు నిలిపివేత. వరుసగా 5వ రోజు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన పోలీసు అధికారులు.
* ఇవాళ ఏపీ వ్యాప్తంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష.