తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలం ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడారు. బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని, శాశ్వత కాలనీల కోసం అధికారులు ఎత్తయిన ప్రదేశాలను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10వేలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని కేసీఆర్ చెప్పారు. రెండు నెలల పాటు 20 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని తెలిపారు. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు.
read also: CM KCR Aerial Survey: వరద బాధితులకు రూ.10వేలు ఆర్థిక సాయం
దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. దీని వెనుక కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు సీఎం. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.. గతంలో లేహ్‌లో కూడా ఇలా చేశారని, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గోదావరిలో వదరనీరు 50 అడుగులు వచ్చినా కొన్ని కాలనీలు నీటమునుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేవుడి దయ వల్లే కడెం ప్రాజెక్టు సేఫ్‌గా ఉందని సీఎం కేసీఆర్ పర్కొన్నారు. ఈనెల 29 వరకు ప్రతిరోజు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ చెప్తోందని, కాబట్టి వరద ముప్పు తొలగిపోలేదని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో కనీవినీఎరగని విధంగా వరదలు చూస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరి బ్రిడ్జిపై గంగమ్మకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసారు. గోదావరి ప్రవాహం, పరిసర ప్రాంతాలను కేసీఆర్ పరిశీలించారు.
CM KCR: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశాల కుట్ర.. అందుకే భారీ వర్షాలు