CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పుల వల్ల రాష్ట్రం ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన…
Bandi Sanjay : హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే…
KTR: జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు…
Harish Rao : కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన మాజీ ఆర్థికమంత్రి హరీష్ రావు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని. కానీ దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్ దేశమంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుందని, కానీ పోయినసారి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి…
TPCC Mahesh Goud : తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ కు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందన ఆయన…
Chamala Kiran Kumar Reddy : పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలని, హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలన్నారు చామల కిరణ్ కుమార్. కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని…
Ponnam Prabhakar : ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవారికి ఇళ్లు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకు ముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదన్నారు. మేము పేదల అందరికీ పథకాలు అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇందిరమ్మ పేరు ఉంటే డబ్బులు ఇవ్వం అంటున్నారని, మీ జేబులో నుండి ఇస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.…
KTR: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తామని కేటీఆర్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయంకి పెట్టాలి అని అడిగారన్నారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు మరో తొమ్మిది పద్దులపై చర్చ మొదలైంది. నిన్న (సోమవారం) ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్ల నిధులు కేటాయించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ కేసీఆర్‌కు ఆ ఆలోచన లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లు.. రేవంత్, భట్టిలకు అభినందనలు చెప్పాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.