తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం 2,26,982, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదించారు. తలసరి ఆదాయం రూ. లక్ష 74 వేల 172. రూ. 1.8 తలసరి ఆదాయం పెరిగింది. కాగా గత బడ్జెట్.. 2.91 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది
• ప్రగతి, సంక్షేమం, సుప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్
• హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050: కాలుష్యరహిత నగరంగా హైదరాబాద్ అభివృద్ధి
• రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12,000 ఆర్థిక సహాయం
• 25.35 లక్షల రైతులకు రూ. 20,616 కోట్లు రుణ మాఫీ
• మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
• 43 లక్షల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ – రూ. 433 కోట్ల ఖర్చు
• గృహజ్యోతి పథకంలో 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్
• 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్లు పథక ప్రారంభం
• ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు
• వడ వరి కొనుగోలుకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్
• ఎగుమతులకు ఆయిల్ పామ్ రైతులకు అదనపు సబ్సిడీ
• పశుసంవర్థన శాఖకు రూ. 1,674 కోట్లు – టీకా ఉత్పత్తి కేంద్రం విస్తరణ
• విద్యా రంగానికి రూ. 23,108 కోట్లు – యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు
• ITIలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి
• యువత కోసం యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్శిటీ ప్రారంభం
• ఉద్యోగావకాశాల కల్పనకు డిజిటల్ ఉపాధి కేంద్రం
• తెలంగాణకు తలసరి ఆదాయం రూ. 3,79,751 – దేశ సగటు కంటే అధికం
• రాష్ట్రీయ స్థాయిలో మహిళా ఉపాధి శాతం 52.7% – దేశంలో అత్యధికం
Also Read:KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు..రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు..
రాష్ట్ర ప్రగతి కోసం “తెలంగాణ రైజింగ్ 2050” ప్రణాళిక విడుదల
• హైదరాబాద్‌కి గ్లోబల్ సిటీలోకి మార్పు కోసం మాస్టర్ ప్లాన్ రూపొందింపు
• మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఊపందించిన ప్రభుత్వం
• పాఠశాలలకు డిజిటల్ వసతులు – మౌలిక సదుపాయాల అభివృద్ధి
• నిరుపేద విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు, ఉచిత ఉపకరణాలు
• రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
• మార్కెట్ యార్డుల్లో ఆధునిక సదుపాయాలు, నూతన మౌలిక సదుపాయాలకు నిధులు
• వడల కొనుగోలుకు 8,332 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు
• విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులకు ప్రత్యేక సబ్సిడీలు
• ఆయిల్ పామ్ సాగుకు అదనపు ప్రోత్సాహకంగా టన్నుకు రూ. 2,000 బోనస్
• పశువైద్య టీకాల ఉత్పత్తికి శాంతినగర్ కేంద్రాన్ని 300 కోట్లు వెచ్చించి విస్తరణ
• కొహెడలో చేనేత ఎగుమతుల మార్కెట్‌కు 47 కోట్ల నిధులు
• మైదాన ప్రాంతాల్లో పశుసంవృద్ధి కోసం రూ. 21 కోట్లతో ఫోర్జెన్ సీమెన్ స్టేషన్
• భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
• 10,954 గ్రామ సర్వేయర్ పోస్టులు మంజూరు – భూ రికార్డుల స్పష్టత పెంపు
• నూతన రేషన్ కార్డుల జారీ ప్రారంభం – అదనంగా కుటుంబ సభ్యుల నమోదు
• పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖకు MNREGS నిధులతో వేగం
Also Read:Shashi Tharoor: అలా విమర్శించి మూర్ఖుడిలా మిగిలా
ఆరోగ్య శాఖ:
• ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంపు
• కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరిక
• 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ లబ్ధి
• ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును 20% పెంపు
• 163 కొత్త చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేరవచ్చన్న ప్రభుత్వం
• వైద్య కళాశాలలకు భారీగా నిధులు కేటాయింపు
• ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యానికి భారీ మద్దతు
విద్యా రంగం:
• 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ. 11,600 కోట్లు
• ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు
• స్కూల్స్‌లో IIT-JEE, NEET కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు
• గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40%, కాసటిక్ ఛార్జీలు 200% పెంపు
• పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు
• విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం
• సంక్షేమ వసతి గృహాల్లో “కామన్ డైట్” స్కీం అమలు ప్రారంభం
Also Read:Mega Star : వ్యోమగాముల రాకనుద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
యువత – ఉపాధి రంగం:
• ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం
• AI సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్
• తెలంగాణలో నిరుద్యోగం రేటు 22.9% నుంచి 18.1% కు తగ్గింపు
• 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగింపు
• ఐటీIs ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా రూపాంతరం
• తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణ
• రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6,000 కోట్లు – యువతకు స్వయం ఉపాధికి పుష్టి
• BFSI రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు – 38 కళాశాలల్లో ప్రారంభం
సాంకేతిక మరియు పారిశ్రామిక రంగం:
• హైదరాబాదును గ్లోబల్ టెక్ సిటీగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్
• బయోటెక్నాలజీ, ఫార్మా, EV తయారీకి ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు
• మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజ్‌ల అభివృద్ధికి మద్దతు
• “చైనా+1” విధానం కింద తెలంగాణను గ్లోబల్ తయారీ హబ్‌గా అభివృద్ధి
• పశువైద్య టీకాల తయారీ కేంద్రాన్ని శాంతినగర్ నుండి మమ్మడిపల్లి కి తరలింపు
Also Read:KCR: ఈసారి బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు అవనున్న ప్రతిపక్ష నేత
రైతు సంక్షేమం:
• రైతులకు రూ. 20,616 కోట్ల రుణ మాఫీ
• రైతు భరోసా కింద ఎకరాకు రూ.12,000
• రైతు భరోసాకు రూ. 18,000 కోట్ల బడ్జెట్
• సాగు భూముల వడపోతకు గ్రామ సభల ధృవీకరణ
• సన్న వడలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్
• 40 లక్షల ఎకరాల్లో సన్న వడ సాగు విస్తరణ
• ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంపు
• ఆయిల్ పామ్ సాగుకు టన్నుకు రూ. 2,000 అదనపు సబ్సిడీ
• వడల బోనస్ కింద రైతులకు రూ. 1,206 కోట్లు చెల్లింపు
• పశుసంవర్థన శాఖకు రూ. 1,674 కోట్లు కేటాయింపు
• పశువైద్య టీకాల తయారీలో భారీ విస్తరణ ప్రణాళిక
• వేవసాయ మారకెట్లకు రూ.181 కోట్లతో ఆధునిక సదుపాయాలు
మహిళా సంక్షేమం:
• మహాలక్ష్మీ బస్సులో ఉచిత ప్రయాణానికి రూ. 5,005 కోట్లు ఆదా
• ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 433 కోట్లు
• ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుపై మంజూరు నిర్ణయం
• మహిళలకు ఉద్యోగ అవకాశాల్లో దేశంలో అత్యధిక శాతం
• మహిళా ఉపాధి శాతం 52.7% – దేశ సగటు కన్నా ఎక్కువ
• కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
• మహిళా విద్యకు ప్రత్యేకంగా గురుకులాల మౌలిక సదుపాయాల పెంపు
• రేషన్ కార్డుల మంజూరులో మహిళా ప్రధాన కుటుంబాలకు ప్రాధాన్యత
• మహిళలకు టెక్నికల్ స్కిల్స్ పై ప్రత్యేక శిక్షణ కేంద్రాలు
• మహిళా హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్‌లో కామన్ డైట్ స్కీం అమలు
• యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల్లో బాలికలకు ఉచిత IIT, NEET కోచింగ్
Also Read:Anakapalle Murder Case: శరీర భాగాలు లభ్యం కేసు.. హత్యకు గురైంది మహిళ కాదు..!
హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050 కు శ్రీకారం
• మాస్టర్ ప్లాన్‌లో గ్లోబల్ టెక్ హబ్ లక్ష్యంగా ప్రణాళిక
• హైదరాబాద్ ను గ్రీన్ టెక్ సిటీగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం
• “తెలంగాణ రైజింగ్ 2050” లక్ష్యంగా రూ. ట్రిలియన్ ఎకానమీ వైపు అడుగులు
• డిజిటల్ తెలంగాణ కోసం మాస్టర్ ప్లాన్ – సౌర, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు
• ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు
• AI సిటీ కోసం 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్నాలజీ సిటీ ప్రణాళిక
• ITIs ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చనున్న ప్రభుత్వం
• 65 ITIsలో టాటా టెక్నాలజీ భాగస్వామ్యంతో ప్రత్యేక కోర్సులు
• BFSI రంగంలో టెక్ ట్రైనింగ్ – 10,000 మంది విద్యార్థులకు లబ్ధి
• తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రానికి ఆధునికీకరణ
• హైదరాబాద్ IT & ఫిన్‌టెక్ రంగాల్లో ఉపాధి వృద్ధి కేంద్రంగా ఎదుగుతుంది
• బయోటెక్, ఫార్మా, EV తయారీలో గ్లోబల్ తయారీ హబ్‌గా తెలంగాణ
• ప్రైవేట్ మరియు ప్రభుత్వ భాగస్వామ్యంలో టెక్ స్కిల్స్ పెంపు
• Telangana: “China +1” విధానంతో ఇండస్ట్రీలో ముందుండే లక్ష్యం
• టెక్ స్కిల్స్ కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ప్రారంభం
• కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫాంలపై ఉపాధి అవకాశాల విస్తరణ
• యువత కోసం టెక్ మరియు AI లో ప్రాథమిక స్థాయి శిక్షణ ప్రారంభం