నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రేపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో నేటితో చర్చ ముగియనుంది. గత రెండు రోజుల్లో 24 అంశాలపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు మిగిలిన 13 అంశాలపై చర్చ జరగనుంది. నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్య పన్నులు, వైద్య ఆరోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, గృహ, వ్యవసాయం, సహకారం, పంచాయతీరాజ్, రవాణా శాఖ, గవర్నర్-మంత్రి మండలిపై చర్చించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం సాధించిన విషయాలను బీఆర్ఎస్ చెప్పుకోవాలన్నారు.
తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు నగర్లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ అంతా డొల్ల అని.. ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుష్క వాగ్దానాలు-శూన్య హస్తాలేనంటూ ఆయన ఎద్దేవా చేశారు.