తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరం కానున్నారు. ఈరోజు జరగబోయే బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అవనున్నారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈసారి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగంతో…
ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానుండగా..ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
Telangana Budget Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని చెప్పారు.. అయితే, గవర్నర్‌ను విమర్శించొద్దనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ధర్మాసనానికి తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. దీంతో, రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య సయోధ్య కుదిరందననే…
అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు.. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించారు.. సెర్ప్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు.. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరపాటు చేయవద్దని సూచించిన ఆయన.. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐకేసీ, మెప్మా ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనలు ఇస్తామని పేర్కొన్నారు.. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై…
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ, మండలి ఇవాళ్టి నుంచి సమావేశం కానున్నాయి. ఉభయసభలు ప్రొరోగ్ కానందున గత అక్టోబర్‌లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వీటిని ఏడాదిలో మొదటి సమావేశాలుగా పరిగణించనందున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం వుండదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడింది. బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు…
మార్చి నెల వచ్చేస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నెలరోజులవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. 2022- 23 రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారుచేయడానికి సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…