అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు.. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించారు.. సెర్ప్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు.. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరపాటు చేయవద్దని సూచించిన ఆయన.. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐకేసీ, మెప్మా ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనలు ఇస్తామని పేర్కొన్నారు.. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ కంటే దిగజారిపోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం బాగుంటే దేశమంతా బాగుంటుందని తెలిపారు.
Read Also: KCR: ఉక్రెయిన్ రిటర్న్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక అంతా మేమే..
ఇక, రాష్ట్రంలో ఉన్న మూడు మెడికల్ కళాశాలలను 33కు పెంచుతున్నట్టు ప్రకటించారు కేసీఆర్.. రాష్ట్రంలో 13 వర్సిటీలు ఉంటే మరో 11 వర్సిటీలు నెలకొల్పామన్న ఆయన.. దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకంగా అభివర్ణించారు.. మార్చి 31 లోపు 40 వేల కుటుంబాలకు దళిత బంధు అందనుందని స్పష్టం చేశారు. దళిత బంధుతో పాటు దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.. మరోవైపు, పోడు భూముల సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు కేసీఆర్..