Telangana Budget Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయని చెప్పారు.. అయితే, గవర్నర్‌ను విమర్శించొద్దనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ధర్మాసనానికి తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. దీంతో, రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య సయోధ్య కుదిరందననే చెప్పాలి..
Read Also: INDvsNZ T20: ఒక్క సిక్స్ కొట్టలే..ఇదేం మ్యాచ్‌రా బాబు
హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత.. అడ్వొకేట్ జనరల్ చాంబర్‌లో గవర్నర్ తరపు లాయర్ అశోక్ రాంపాల్.. ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే.. అడ్డొకేట్ జనరల్ దాదాపు గంట పాటు సమావేశమై అనేక అంశాలపై చర్చించారు.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచి ప్రభుత్వంపై వచ్చే విమర్శలు.. అధికార పక్షం నుంచి గవర్నర్‌ను టార్గెట్ చేస్తూ చేసే విమర్శలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.. ఈ వాతావరణం ఉండకూడదనే నిర్ణయానికి వచ్చారు.. ఈ చర్చలు సఫలం అయ్యాయి.. అయితే, తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు దుష్యంత్ దవే.. ఇదే సమయంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.. గవర్నర్ తరపు లాయర్ తో మాకు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు.. దీంతో.. ఈ కథ సుఖాంతం అయినట్టు అయ్యింది..