Telangana Budget Session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి నెల వచ్చేస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నెలరోజులవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. 2022- 23 రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారుచేయడానికి సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి త్వరలో తేదీలను నిర్ణయిస్తారు. శాసనసభ, మండలిని సమావేశ పర్చాల్సిన తేదీలపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్థికశాఖ అధికారులు రెడీ అవుతున్నారు. ఉద్యోగుల వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయానికి సంబంధించిన పద్దులు సిద్ధం అయ్యాయని తెలుస్తోంది. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ఇతరత్రాలకు సంబంధించిన ప్రగతిపద్దు తయారీ శరవేగంగా సాగుతోంది.
Also Read
ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ఉద్యోగాల నియామకాలకు అవసరమైన మొత్తాన్ని నిర్వహణపద్దులో సర్దుబాటు చేశారు. .రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాలి. ఆలోగా ఉభయ సభలు పద్దుకు ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణం చేసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి.. ఆలయ మహా కుంభ సంప్రోక్షణ ముహూర్తాన్ని మార్చి 28న ఖరారు చేశారు. ఆ ముహూర్తంలోగా బడ్జెట్ సమావేశాలు ముగించనున్నారు. ఇవాళ్టి భేటీ అనంతరం సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళతారని తెలుస్తోంది. ఫ్రంట్ పనుల్లో భాగంగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అవుతారు సీఎం.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?