హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు నేను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇక్కడికి వచ్చి నేను అంటే నేను…
హామీలదేముంది ఫ్రీగా ఇచ్చేయొచ్చు. నెరవేర్చటం మాత్రం అంత ఈజీ కాదు. ఇది సామాన్యులకే కాదు.. నేతలకు కూడా అనుభవమే అవుతోంది. ఈ విషయం ఇప్పుడు కమలంలో ఉన్న మాజీ టిడిపి నేతలకు మరింత ఎక్కువగా తెలుసట. అందుకే… కమలం పార్టీ తమకు పెద్దగా వర్కవుట్ కాలేదని భావిస్తున్నారట. కమలం పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారా? ముఖ్యంగా ఇతర పార్టీ ల నుండి వచ్చిన నేతలు ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారా? ఇదే టాక్ ఇప్పుడు ఆ పార్టీలో…
యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు బీబీ నగర్ ఎయిమ్స్ లో రేడియో డయగ్నోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 8:40 యాదాద్రిలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. 10:30 యాదగిరిగుట్టలో రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చ్ రాష్ట్ర కార్యవర్గం సర్వ సభ్య సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు బండి సంజయ్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఈమేరకు ఆగస్టు…
కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్పై టీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ విమర్శించారు. ఇన్నాళ్లుగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్తో కుమ్మక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణను విస్మరించారని ఆమె ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను కేఆర్ఎంబీ నిలిపేస్తుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న…
తెలంగాణ బీజేపీ పార్టీ పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో ఉండాలని భావిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. కాగా నేడు మరోసారి బండి సంజయ్ అధ్యక్షతన ఈ విషయమై సమావేశం జరిగింది. ఆగస్టు 9 నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర, హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన అంశాలుగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక, నియంత, గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబపాలనలో…
తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సంజయ్ గారి ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి.…
తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లన్నరేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే హీట్ పుట్టింది. అన్ని పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. నేతలు ప్రజల మధ్య ఉండేందుకు, పార్టీ శ్రేణులను యాక్టీవ్ చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ సారథి కూడా జిల్లాల బాట పట్టారు. వరసగా జిల్లాల పర్యటన చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు హాట్హాట్గా మారిపోయాయి. పార్టీ నేతలు జిల్లాల బాట పడుతున్నారు. పోటాపోటీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా టైమ్…
జై శ్రీరాం నినాదం లేకుండా బీజేపీ నేతల ప్రసంగాలను ఊహించలేం. కాషాయ కండువా కప్పుకొనేవాళ్లు ఎవరైనా.. కొత్తలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఇలాంటి స్లోగన్స్కు అలవాటు పడతారు. కానీ.. ఆ మాజీ మంత్రికి ఇంకా బీజేపీ బాడీ లాంగ్వేజ్ వంటబట్టలేదట. కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ వల్లో ఏమో.. ఆయన తీరు వినూత్నంగా ఉందట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఈటల నోటివెంటరాని జైశ్రీరాం నినాదం! ఈటెల రాజేందర్. మాజీ…
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి బాబుమోహన్ కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించిన బాబుమోహన్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. గతంలో ఉన్న సీఎంలు ఎవ్వరు కూడా ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టలేదన్నారు. రైతుబంధు వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఒరుగుతున్నది ఏమీలేదని బాబు మోహన్ ఆరోపించారు. కేసీఆర్ పాలన వలన పేదలకు ఏమి లాభం లేదని,…