బీజేపీ నాయకులు.. తెలంగాణలో అందివచ్చిన వేవ్ ను కొనసాగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. దుబ్బాకలో గెలుపు ఇచ్చిన కిక్ తో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ లో అందిన అనూహ్య విజయం ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. ఇది కొనసాగించడంతో పాటు.. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ అడుగులకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో.. బండి సంజయ్ విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీపైనా విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వేడిని మరింత…
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్… ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నిన్న చార్మినార్ దగ్గర ప్రారంభం అయింది. చార్మినార్ దగ్గర ప్రారంభమైన ఈ పాదయాత్ర…. అసెంబ్లీ మీదుగా… నిన్న రాత్రి సమయానికి మెహిదీపట్నం కు చేరుకుంది. నిన్న రాత్రి అక్కడే బస చేసిన బండి సంజయ్… ఇవాళ రెండో రోజు ప్రజా…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర మొదటిరోజు ముగిసింది. అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్ర అని సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించిన ఆయన మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి కాళేజీకి చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బసచేయనున్నారు. సంజయ్ బస కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.…
హుజూరాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. టైమ్ దగ్గరవుతున్నందున అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఎవరన్నది కూడా దాదాపు ఫైనల్ అయింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ కోసం రేవంత్ వెయిటింగ్. కాగా బరిలో తామూ ఉంటామని వైఎస్ షర్మిల ఇటీవలే ప్రకటించారు. దాంతో వైఎస్సార్టీపీ అభ్యర్థి కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉంటారని తేలిపోయింది. ఇక బీఎస్పీ ఇప్పటి…
బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని.. దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వటంలేదో హరీష్ రావు చెప్పాలని రఘనందన్ ప్రశ్నించారు. బీజేపీలో పంచాయితీల సంగతి అటుంచి.. ఒకే కుటుంబంలో కేటీఆర్, కవిత పంచాయితీ ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ లేని హరీష్ తో నీతులు చెప్పించుకునే…
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌కి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారు. 66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 టీఎంసీలు రావాల్సి ఉంది. 299 టీఎంసీల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పంతాలు,…
తెలుగు రాష్ట్రాల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టిందా? ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారా? బీజేపీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయి? సర్వే పేరుతో నేరుగా రంగంలోకి మోడీ! ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి చివరిక్షణాల్లో పార్టీల వడపోతలు కామన్. మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణాల్లో బీజేపీ చేసింది కూడా ఇదే. ఇప్పుడు మాత్రం బీజేపీ…
ఇంఛార్జ్‌లను వేయకపోతే పార్టీకి ఛార్జింగ్ కష్టమా? కొత్త పోకడలకు చోటు లేదంటోంది ఎవరు?నిర్ణయం తీసుకుంటే ఒక భయం.. తీసుకోకపోతే మరింత ఆందోళన అన్నట్టుగా పరిస్థితి మారిందా? ఇంతకీ ఏంటా పార్టీ? ఏమా ఇంఛార్జ్‌ల గోల? నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించాలని కోరారట! తెలంగాణ బీజేపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. అడ్డుకట్ట వేయడానికి ఆపసోపాలు పడుతున్నారు కమలనాథులు. ఇదే సమయంలో కాషాయ శిబిరంలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అవి ఆచారణ సాధ్యమా కాదా అని పక్కన పెడితే..…
తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ది కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తన నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని, వారి కోరిక మేరకు రాజీనామా చేస్తానని చెప్పారు. ఉపఎన్నిక వస్తే కానీ బడుగులు, రైతులపై కేసీఆర్ కు ప్రేమ రావడం లేదని ఇటీవలే ఉపఎన్నికల హామీలను ఉద్దేశించి రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ రూ. 10 లక్షల చొప్పున…
ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్‌గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోకుండా ‘ఢిల్లీ టూర్’! తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు.…