తెలంగాణ బీజేపీలో పాత కమలనాథులు ఇక ఫేడ్ అవుటేనా? పార్టీ పరంగా ఇక గుర్తింపు లేనట్టేనా? పాతవాళ్లను పక్కన పెట్టి.. కొత్త వాళ్లను అందలం ఎక్కించడంపై కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ ఇస్తున్న సంకేతాలేంటో నాయకులకు అర్థం కావడం లేదా? బీజేపీ పాత నేతలు ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్నారా?కమిటీలో ఆరుగురికి చోటిస్తే.. ఐదుగురు కొత్తవారే..! బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యలు ప్రకటన తెలంగాణ కాషాయ సేనలో సెగలు రేపుతోంది. పార్టీలో పదవులు పేరు…
ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్కు కొత్త పాఠాలు నేర్పిందా? ప్రజల సమస్యలతోపాటు.. సొంత పార్టీలోని సమస్యలు బోధపడ్డాయా? బీజేపీ కోసం పనిచేసే వారు ఎవరు? శల్య సారథ్యం చేస్తోంది ఎవరో గుర్తించారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందట..! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ముగిసిన తర్వాత పార్టీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఆసక్తిగా మారింది. ఈ…
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరగుతోంది. ఓ వైపు ప్రచార హోరు ..మరోవైపు నామినేషన్ల పర్వం. నామినేషన్ల గడువు కూడా దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భార్య జమున నామినేషన్ దాఖలు చేశారు. కొంత కాలంగా ఆమె తన భర్త తరపున నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓటడుగుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో…
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను హజురాబాద్లో ఘనంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. వారికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. ఇప్పుడేం చేస్తారు? కమలనాథుల ప్లానింగ్ ఏంటి? ఎన్నికల కోడ్తో సంజయ్ యాత్ర ముగింపుపై బీజేపీలో చర్చ..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 28న ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. ఉపఎన్నిక జరగుతున్న హుజురాబాద్లో అక్టోబర్ రెండున భారీ రోడ్ షోతో మొదటి విడత యాత్రను ముగించాలని అప్పట్లో అనుకున్నారు. నిన్న మొన్నటి…
తెలంగాణ ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఉన్నాయని, బీజేపీని విమర్శించడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అర్హత లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘2023లో తెలంగాణలో భారతీయ జెండాను ఎగురవేస్తాం. నన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా.. తెలంగాణలో ధర్మం గురించి పాటుపడతానని బండి సంజయ్ తెలిపారు. దళిత బంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు తెలంగాణలో సర్పంచులు పరిస్థితి ఎలా…
హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు…
అధికార పార్టీలో ఉన్నా.. అనుకోని పరిస్థితుల్లో మరో పార్టీలోకి చేరినా.. తన రూటే సెపరేటు.. అని ఇతరులు అనేలా నడుచుకుంటున్నారు.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. కొంత కాలం క్రితం వరకూ.. గులాబీ జెండా మోసి.. అజెండానూ అమలు చేసిన ఆయన.. అనుకోని పరిస్థితిలో కమలం బాట పట్టారు. కాషాయం గూటికి చేరారు. కానీ.. తన ఒరిజినాలిటీ మాత్రం కోల్పోయేది లేదు.. అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒక్కసారి.. ఈటల టీఆర్ఎస్ నుంచి…
హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు సార్లు వస్తారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే అమిత్ షా పర్యటనకు సంబందించిన షెడ్యూలు చెబుతామన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘హుజురాబాద్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసే అవకాశం ఉంది.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం ఢిల్లీ వెళ్లాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. నిర్మల్ అమిత్…
బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు… పవర్ అంతా.. ఢిల్లీ చేతిలోనే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస.. బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. గల్లీలో బండి సంజయ్ సీఎం నీ గల్లీలో బండ బూతులు తిడతారు. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు.. బండి సంజయ్ ఇప్పటికీ సీఎంని జైల్లో పెడతా అని రెండు వందల అబద్ధాలు అడి ఉంటారు అని తెలిపారు. పులి.. మేక ఆటలో బండి సంజయ్ బలి అయిపోతారు.…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… బండికి అడ్డువస్తే పగిలిపోతుందని రాజా సింగ్ హెచ్చరించారు. బండి సంజయ్ పాదయాత్ర 100 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యం లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని… ప్రజలు స్వాగతం పలుకుతున్నారని వివరించారు. బండి సంజయ్ పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందొ స్పష్టం అవుతోందని… ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం పోతుంది… పేద ప్రజల బీజేపీ సర్కార్ వస్తుందని తెలిపారు.…