తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని మండిపడ్డారు. ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని…
రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బాబాపూర్‌కు చెందిన సరస్వతి 317 జీవో మూలంగా స్వంత ఊరు నుంచి కామారెడ్డికి ట్రాన్సఫర్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు ఎం ధర్మారావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విట్టల్, నిజామాబాద్ జిల్లా…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదుతో నిజామాబాద్ ఐదో టౌన్ పోలీసులు అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతేడాది అక్టోబర్ 31న హైదరాబాద్‌లో అట్రాసిటీ చట్టాన్ని కించపరిచేలా అరవింద్ వ్యాఖ్యానించారని.. దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయన్ను చట్టప్రకారం శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. Read Also: జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు మరోవైపు మంగళవారం నాడు…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.
పెద్దవాళ్ల దగ్గర ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఏంటా కుప్పిగంతులు అంటారు. అదే ఓ స్థాయిలో ఉన్నవాళ్లు చేస్తే.. అంతా నవ్వి పోతారు. హస్తినలో ఆ పార్టీ నేతలు చేసిన పని అలాగే ఉందట. పెద్దాయన దృష్టిలో పడేందుకు.. మార్కులు కొట్టేసేందుకు తెగ తాపత్రయ పడ్డారట. అమిత్ షా చిరు నవ్వులు చూడగానే నేతలు అడ్వాన్స్ అయ్యారా? ముఖ్య నేతలంతా ఢిల్లీ రండి.. అమిత్ షా మాట్లాడతారని కబురు వెళ్లడంతో.. హస్తినలో వాలిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు.…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. రెండు రోజుల కిందట అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ నేపథ్యంలోనే… బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రేపు (09.12.2021 గురువారం) అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి…
పాత రోత.. కొత్త వింత..! తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఇదే ఫాలో అవుతున్నారా? ‘కొత్త’ పెత్తనాలపై ‘పాత’వాళ్లు చిటపటలాడుతున్నారా? వెంట కేడర్ లేకుండా సింగిల్‌గా వచ్చి.. కాషాయ కండువా కప్పుకొంటున్న లీడర్ల తీరుపై ‘ఓల్డ్’ బీజేపీ నేతల అభ్యంతరాలేంటి? ఈ అంశంపై కమలదళంలో ప్రశ్నల పరంపర మొదలైందా? లెట్స్ వాచ్..! గట్టిగానే సౌండ్ చేస్తోన్న ఓల్డ్ బీజేపీ నేతల ప్రశ్నలు..! మొదటి నుంచి జెండాలు మోసేది మేము..! మాపై పెత్తనం చేసేది కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులా?…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఉద్యమిస్తున్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 22 రోజులుగా చేస్తున్న మహా పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తర్వాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఏపీ…
నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తాం. రైతుల పక్షాన పోరాడతాము అని బండి సంజయ్ అన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయి, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోంది. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే…
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందని చెబుతారు. అక్కడ మాత్రం మంది ఎక్కువై.. ప్రొటోకాల్ సమస్యలు వస్తున్నాయి. ముందొచ్చిన చెవులు కంటే.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మారింది సీన్. ఇంకేముంది.. ముందు నుంచీ జెండాలు మోసిన పాతకాపులు కుతకుతలాడుతున్నారట. పాత నేతలు వెనక బెంచీలకే పరిమితం..! తెలంగాణ బీజేపీలో ఒకప్పుడు చెప్పుకోదగ్గ నాయకులు నలుగురో.. ఐదుగురో ఉండేవారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. కాషాయ శిబిరంలో నేతల జాబితా పెరిగింది. వలస నాయకుల సంఖ్య ఎక్కువైంది.…