రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలి: బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బాబాపూర్‌కు చెందిన సరస్వతి 317 జీవో మూలంగా స్వంత ఊరు నుంచి కామారెడ్డికి ట్రాన్సఫర్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు ఎం ధర్మారావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విట్టల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్యలు కలిసి సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు బాబాపూర్ గ్రామానికి వెళ్లనున్నట్టు బీజేపీ వర్గాలు ప్రకటించాయి.
Read Also: కోవిడ్ విజృంభిస్తున్న వేళ.. మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ
Also Read
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 317 జీవోతో కామారెడ్డికి ట్రాన్సఫర్ అయిన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన సరస్వతి ఆత్మహత్యకు తమను కలిచి వేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న టీచర్లు ఈ జీవోతో ఇబ్బందులు పడడం జీవితాలు చాలించడం ఎంతో బాధాకరమని తెలిపారు. మనస్తాపానికి గురై ఇప్పటికీ తొమ్మిది మంది బలవన్మరణాలకు పాల్పడడం దురదృష్టకరం. ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడకూడదని బీజేపీ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ , గుండె ఆగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!