Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారా నగర్‌లో జగదీశ్వర్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనని గెలిపించాలని ప్రజలను కోరారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లాలోని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్‌లో ఉన్నారు.. జగ్గారెడ్డి సీఎం అవుతా అంటున్నారు.. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ ప్రసంగించారు.
బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె తెలిపారు.
Minister KTR Audio Leak: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతల్లో ఐటీ మంత్రి కేటీఆర్ ఒకరు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నాయకుడిగా ఎదుగుతున్నారు.
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో పాల్గొన్నారు. అధికారిగా ఉన్నప్పుడు చాలా పరిమితులు ఉంటాయని.. రాజకీయాల్లో ఉంటే పరిమితులు ఉండవన్నారు. ఖాకీ, ఖద్దరు రెండు బాగానే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా మాత్రమే చూశాను.. ఇంద్రుడు, చంద్రుడు అని ఎప్పుడూ పొగడలేదన్నారు.
ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదు.. లంబాడాలను ఆదుకోలేదని ఆయన విమర్శించారు.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని వనమొనిగూడతండా, నామ్యతండా, బిల్డింగ్ తండా, హేమాజిపూర్, తిమ్మారెడ్డిపల్లి, నేలబండతండా, పొలిమేరబండతండా తదితర గ్రామాల్లో లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు.
Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారంలో భాగంగా..