BSP Chief Mayavati: బీఎస్పీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆమె తెలిపారు. మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆమె వెల్లడించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన బీఆర్ఎస్ పార్టీ అని మాయావతి విమర్శలు గుప్పించారు.
Also Read: Revanth Reddy Fire On KCR: నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి
ఉత్తర ప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్నపుడు భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేశామమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తరువాత భూమి లేని నిరుపేదలకు భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలన్నారు. 30న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బీఎస్పీని గెలిపించాలని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రజలను విజ్ఞప్తి చేశారు.