Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారంలో భాగంగా.. రోడ్ షో నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని, సీతారాంపేట్, మంచాల మండలం, నోముల, లింగంపల్లి, మంచాల, చిత్తాపూర్, బండలేముర్, చెన్నారెడ్డి గూడా, పీసీ తాండ, బుగ్గ తాండ, ఆరుట్లలో ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేదల భూములను లాక్కొని భూములను ముంచారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి తో కలిసి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం, ఆటో యాక్సిడెంట్లు చనిపోయిన ఫ్యామిలీలకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన చుట్టూ తిప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాట తప్పారని.. రైతులకు న్యాయం చేస్తానని కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు అరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గత 15 సంవత్సరాల నుండి పదింతల అభివృద్ధికి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ స్కీమ్ లను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది.. వైఎస్సార్ హయాంలో రైతులకు ఉచితవిద్యుత్ ఇచ్చారని తెలిపారు. రైతులు చనిపోతే రైతూ భీమా ఇచ్చే బదులు బ్రతుకున్నపుడు ఆదుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వము హయంలో కౌలు రైతులకు న్యాయం చేస్తారని అన్నారు. గత పది సంవత్సరాలుగా అడ్డం పెట్టుకొని కుటుంబ పాలన చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్.. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, అనేక సంక్షేమ పథకాలు ఎక్కడ పోయాయి? అని ప్రశ్నించారు.
Sanju Samson: సంజూ.. నెదర్లాండ్స్ లేదా ఐర్లాండ్ తరఫున ఆడు! 2027 ప్రపంచకప్‌లో ఆడుతావ్