విజయం సాధించాలంటే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు కనిపిస్తారు.. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్సైన సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ఆశిస్తారు.. కానీ, అది అంత తేలికైన విషయం కాదు.. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం.. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి..
KTR Tweet: డీప్‌ఫేక్‌లపై బీఆర్‌ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్‌ను మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఓటింగ్ సమీపిస్తున్న కొద్దీ చాలా డీప్‌ఫేక్‌లు ఉండవచ్చని హెచ్చరించారు.
తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లున్నారు. దీంతో.. వారందరికీ సరిపోయేలా.. 35వేల 635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ఈసీ. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను ఈసీ సిద్ధం చేసింది.
Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ వాతావరణం బాగుండాలి.. ఖమ్మంలో ఆ పరిస్థితి లేదని, తాను మంత్రివర్గం నుంచి తప్పుకున్నాక పరిస్థితులు మారాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో పాల్గొన్నారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
దేశానికి దిక్సూచిలా తెలంగాణ పాలన, పథకాలు ఉన్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారు తెలంగాణ అభివృద్ది చూసి ఆశ్చర్యపోతున్నారని.. పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అడుగుతున్నారన్నారు.
ఈ సారి సాధారణ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ జరిగిందని, ఈవీఎం బ్యాలెట్స్ ప్రింట్ కూడా అయ్యాయన్నారు. 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు.
ఎన్నికలు వస్తే ఆగమాగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మంచి వాళ్ళ చేతిలో రాష్ట్రం ఉంటే మంచిగా ఉంటుందని.. బేకార్ గాళ్ల చేతుల్లో పడితే ఆగం అవుతుందన్నారు.