MLA Laxmareddy: జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. మండలంలోని వనమొనిగూడతండా, నామ్యతండా, బిల్డింగ్ తండా, హేమాజిపూర్, తిమ్మారెడ్డిపల్లి, నేలబండతండా, పొలిమేరబండతండా తదితర గ్రామాల్లో లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు.
Also Read: Kaleru Venkatesh: ఓటర్లు అభివృద్ధి వైపే ఉన్నారు.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాలేరు
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి గడపకి ప్రభుత్వ సంక్షేమ ఫలం అందిందని ,అభివృద్ది చేసే ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ నవంబర్ 30న కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజారిటీ అందించాలని ప్రజలను కోరారు. గతంలో 11 సార్లు అధికారం ఇస్తే కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వనోళ్లు ఇవాళ వచ్చి ఉచిత పథకాల పేరుతో హామీ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి రాగానే చేతులు ఎత్తేసారని ఆయన చెప్పారు. నిర్ణయాలు తీసుకునే అధికారం మన చేతిలో ఉండాలంటే బీఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడతల వారీగా పెన్షన్లు ఐదు వేలకు పెంచుతాం.. రైతు బంధును ఏడాదికి ఎకరాకో రూ. 16 వేలకు పెంచుతాం.. ప్రతి ఇంటికి ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.. గత తొమ్మిదేళ్ల పాలన చూసారు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీ ముందరే ఉన్నాయి.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఎలక్షన్లప్పుడు వచ్చి ఉచిత హామీలు ఇచ్చే టూరిస్టుల మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దు అంటూ జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.