తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఓటింగ్ లో పాల్గొననున్నారు.. ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్న సినీ స్టార్స్ మొత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ కు బయలుదేరినట్లు ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న…
తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
దశాబ్ద కాలంలో బలిదానాల మీద గౌరవంతో సమస్యలను లేవనెత్తుతున్నామని... కానీ ఎక్కడ పోటీ చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోటీలో ఉన్నామని ఆయన తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.
మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్. ఈ సందర్భంగా ఓవైసీ అసదుద్దీన్, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిపై బహిరంగ సభలో నిప్పులు చెరిగారు.
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యను పరిష్కరించే వారే లేకుండా పోయారన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు దీనదయాల్ నగర్ బస్తీ వాసుల కష్టాలు వర్ణనాతీతమని వెల్లడించారు.
CM KCR: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.