తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.
పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆశించిన ఫలితం రాలేదన్న ఆయన.. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామన్నారు. 39 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషించాలని ప్రజలు చెప్పారని.. ప్రజలు అందించిన తీర్పును శిరసావహిస్తామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ముగిసింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి.
ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకున్నారు. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నామన్నారు. తనపై గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పయనిస్తుండటంతో ఆయన రాజీనామా చేయడానికి రాజ్ భవన్‌కు వెళతారని సమాచారం.
కాంగ్రెస్ విజయం ఖరారైన అనంతరం టీపీసీసీ చీఫ్ కీలక ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని ఆయన అన్నారు. అదే రోజున ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. . రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమైంది. గతానికి భిన్నంగా ఈసారి ఓట్ల లెక్కింపలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Votes Counting: రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమతుంది.
TS Election Holiday: ఉపాధ్యాయ సంఘం అభ్యర్థన మేరకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సెలవు ప్రకటిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.